బిగ్ బాస్ 3: ఈరోజు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో తెలుసా..?

Published : Sep 08, 2019, 11:42 AM IST
బిగ్ బాస్ 3: ఈరోజు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో తెలుసా..?

సారాంశం

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ మూడో సీజ‌న్ ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ఎవ‌రు ఎప్పుడు ఎలిమినేట్ అవుతార‌నేది చెప్ప‌లేక‌పోతున్నారు.  

బిగ్ బాస్ సీజన్ 3 ఏడు వారాలు పూర్తి చేసుకోబోతుంది. ఎప్పటిలానే ఈ వారం కూడా ఇంటి నుండి ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన లీకులు ముందే బయటకి వచ్చేస్తున్నాయి.

ఈ రియాలిటీ షోని హైదరాబాద్ లో చిత్రీకరించడం, ఒకరోజు ముందుగానే షూటింగ్ పూర్తి చేస్తుండడంతో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నరనే విషయాలు బయటకి తెలిసిపోతున్నాయి. ఏడువారాలు ముగిసిన బిగ్‌బాస్ షోలో ఆరో ఎలిమినేష‌న్‌ కి రంగం సిద్ధమైంది.

రాహుల్, రవి, శ్రీముఖి, అలీ రెజా, మహేష్ లు ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ కాగా.. శనివారం ఎపిసోడ్ లో రాహుల్ సేఫ్ అయినట్లు తెలిసింది. మరి మిగిలిన నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయంలో అలీ రెజా పేరు వినిపిస్తోంది.

ఈ ఏడు వారాల్లో ఒక్కసారి కూడా నామినేషన్ కు వెళ్లని అలీ రెజా మొదటిసారి నామినేట్ అయి ఇప్పుడు ఎలిమినేట్ కాబోతున్నాడని సమాచారం. ఇప్పటివరకు ఎలిమినేషన్ పై వచ్చిన వార్తలన్నీ కూడా కరెక్ట్ అయ్యాయి. మరి ఈ వారం అలీ రెజా ఎలిమినేషన్ ఖాయమైందో లేదో.. మరికొద్ది గంటల్లో తేలనుంది!

PREV
click me!

Recommended Stories

Rajinikanth Biopic: వెండితెరపైకి తలైవా జీవితం.. రజనీకాంత్‌గా కనిపించేది ఎవరు? షాకింగ్‌ ట్విస్ట్
Jana Nayagan 4 Days Collections: ఆదివారం తన రేంజ్‌ చూపించిన విజయ్‌.. జన నాయకుడుకి అదిరిపోయే వసూళ్లు