
ఆర్ ఎక్స్ 100 చిత్రం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టిలో పడిన దర్శకుడు అజయ్ భూపతి. ఓ కొత్త తరహా ప్రేమ కథని ఈ సినిమాతో అందించటంతో యూత్ ఆ సినిమాని బాగా ఆదరించారు. కొత్త వారి తో, లో బడ్జెట్ తో అజయ్ భూపతి రూపొందించిన RX 100 మూవీ సెన్సేషనల్ హిట్టయి, కమర్షియల్ గా ఘనవిజయం సాధించింది.
RX 100 దర్శకుడితో పాటు నటీనటులు కూడా ప్రేక్షకుల,క్రిటిక్స్ ప్రశంసలు పొందారు. ఒక్కసారిగా అతడికి డిమాండ్ పెరిగింది.. పెద్ద నిర్మాణ సంస్థలు, స్టార్ హీరోలు సైతం అతడితో మూవీలు ప్లాన్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ లోగా ఆయన డైరక్టర్ గా కాకుండా నిర్మాతగా ఓ చిత్రం ఎనౌన్స్ అయ్యింది.
వివాద స్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను అజయ్ భూపతి తో కలసి ఒక మూవీ చేయనున్నట్లు వెల్లడించాడు.. ప్రస్తుతం స్ర్కిప్ట్ పనులు జరుగుతున్నాయని, ఈ మూవీకి అజయ్ భూపతి తో పాటు తానూ కూడా నిర్మాతగా వ్యవహరిస్తానని తెలిపాడు వర్మ.. అజయ్ భూపతి ఫోటో ను షేర్ చేస్తూ, అజయ్ పోస్టర్ బాయ్ లా ఉన్నాడని కామెంట్ చేస్తూ, తను, అజయ్ కలసి ఒక సినిమా నిర్మిస్తున్నామని, ఆ సినిమా పేరు “పోస్టర్ “అని ట్వీట్ చేశారు.
డైరక్టర్ గా...
మొదటి సినిమాకే ‘ఆర్‌ఎక్స్ 100’ లాంటి బోల్డ్ స్క్రిప్ట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నారు దర్శకుడు అజయ్ భూపతి. మరి నెక్ట్స్ సినిమాకి ఎలాంటి స్క్రిప్ట్‌తో వస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ అజయ్ భూపతి మల్టీస్టారర్ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులన్నీ పూర్తయిపోయాయట. ఇద్దరు ముగ్గురు హీరోలకు కథ కూడా వినిపించారని సమాచారం. మరికొన్ని రోజుల్లో ఈ మల్టీస్టారర్‌లో కనిపించే హీరోలెవరో అధికారిక ప్రకటన వచ్చే వీలుంది.