2.0 ఫస్ట్ డే కలెక్షన్స్: బాక్స్ ఆఫీస్ కోత మొదలైంది..!

Published : Nov 29, 2018, 09:08 PM IST
2.0 ఫస్ట్ డే కలెక్షన్స్: బాక్స్ ఆఫీస్ కోత మొదలైంది..!

సారాంశం

ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ 2.0 పై మొదటి నుంచి ఎన్నో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నా చివరికి పాజిటివ్ టాక్ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. సినిమా చుస్తే గాని క్లారిటీ రాదని శంకర్ విజువల్ వండర్ కోసం క్యూ కడుతున్నారు. 

ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ 2.0 పై మొదటి నుంచి ఎన్నో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నా చివరికి పాజిటివ్ టాక్ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. సినిమా చుస్తే గాని క్లారిటీ రాదని శంకర్ విజువల్ వండర్ కోసం క్యూ కడుతున్నారు. ముఖ్యంగా 3డి కోసమే అభిమానులు వెయిట్ చేసి మరి టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. 

ఇక మొదటి రోజు కలెక్షన్స్ ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రముఖ మూవీ ఎనలిస్ట్ ల ప్రకారం సినిమా 100 కోట్లను ఈజీగా దాటేసిన మొట్ట మొదటి ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించినట్లు తెలుస్తోంది. ఏరియాలను బట్టి ఎక్కడ ఎంత వసూలు చేసింది అన్న విషయం మరికొన్ని గంటల్లో తెలియనుంది . అయితే ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 2.0 110 కోట్లను రాబట్టిందని సమాచారం. 

అర్ధరాత్రికి పూర్తి కలెక్షన్స్ వివరాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సెకండ్ డే కూడా కలెక్షన్స్ లో ఏ మార్పు లేకపోవచ్చని తెలుస్తోంది. ఇక శని ఆదివారాలు కూడా సినిమాకు కలిసొచ్చే అంశమే కాబట్టి సినిమా ఫస్ట్ వీక్ లో దాదాపు 300 కోట్ల వరకు రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. మరి రజినీ - శంకర్ - అక్షయ్ కాంబో ఏ తరహాలో రికార్డ్ సృష్టిస్తుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?