నన్ను ఐటెం అని పిలిచేవారు.. 'RX100' హీరో!

First Published Aug 8, 2018, 5:39 PM IST
Highlights

ఇంటర్ తరువాత బాగా హైట్ పెరిగిపోయాను. జిమ్ చేసేవాడ్ని. దీంతో మంచి ఫిజిక్ వచ్చింది. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఉండేది. కొద్దిగా డిఫరెంట్ గా ఉండడం, అమ్మాయిలతో ఎక్కువ టైం ఉండడంతో కాలేజ్ లో నన్ను ఐటెం అని పిలిచేవారు

'RX100' చిత్రంతో యూత్ ని ఆకట్టుకున్న నటుడు కార్తికేయ తన తదుపరి సినిమా కబాలి వంటి భారీ బడ్జెట్ సినిమాను నిర్మించిన నిర్మాతలతో చేయబోతున్నాడు. అలానే తన చేతిలో మరో ప్రాజెక్ట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 'RX100' చిత్రంతో అతడికి మంచి బ్రేక్ వచ్చిందనే చెప్పాలి. ఇంతకుముందే అతడి 'ప్రేమతో మీ కార్తిక్' అనే సినిమా తీశాడు. అది ఎప్పుడు విడుదలై వెళ్లిపోయిందో కూడా తెలియదు.

కెరీర్ ఆరంభంలో అందరిలానే తను కూడా చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు. ''మా హైదరాబాద్ లో వనస్థలిపురం. అమ్మానాన్నలు విద్యావంతులు. మాకు నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. నేను ఐఏఎస్, ఐపీఎస్ అవుతానని వాళ్లు అనుకున్నారు కానీ బీటెక్ పూర్తి చేసిన వెంటనే సినిమాల్లోకి వచ్చేశాను. ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఫైనల్ గా 'RX100'తో నాకు మంచు గుర్తింపు లభించింది. ఇప్పుడు హీరోగా అందరూ నన్ను పొగుడుతూ నాతో సెల్ఫీలు తీసుకోవడం కొత్తగా అనిపిస్తుంది.

అమ్మాయిల్లో ఫ్యాన్స్ పెరగడం సంతోషంగా ఉంది. అయితే కాలేజ్ లో మాత్రం నన్ను ఐటెం అని పిలిచేవారు. ఇంటర్ తరువాత బాగా హైట్ పెరిగిపోయాను. జిమ్ చేసేవాడ్ని. దీంతో మంచి ఫిజిక్ వచ్చింది. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఉండేది. కొద్దిగా డిఫరెంట్ గా ఉండడం, అమ్మాయిలతో ఎక్కువ టైం ఉండడంతో కాలేజ్ లో నన్ను ఐటెం అని పిలిచేవారు. నాకొక లవ్ స్టోరీ కూడా ఉంది. కానీ అది బ్రేకప్ అయిపొయింది'' అని చెప్పుకొచ్చాడు. 

click me!