76 ఏళ్ల వయస్సులో పది నిమిషాల్లోనే పాట రాసిన కరుణానిధి

Published : Aug 08, 2018, 05:10 PM IST
76 ఏళ్ల వయస్సులో పది నిమిషాల్లోనే పాట రాసిన కరుణానిధి

సారాంశం

డీఎంకె చీఫ్ కరుణానిధి 76 ఏళ్ల వయస్సులో పదే నిమిషాల్లో ఓ సినిమాకు పాట రాశాడు. సినిమాలో సందర్భం, సన్నివేశాన్ని చెబితే పది నిమిషాల్లో పాట రాసిచ్చాడు కరుణానిధి


చెన్నై: డీఎంకె చీఫ్ కరుణానిధి 76 ఏళ్ల వయస్సులో పదే నిమిషాల్లో ఓ సినిమాకు పాట రాశాడు. సినిమాలో సందర్భం, సన్నివేశాన్ని చెబితే పది నిమిషాల్లో పాట రాసిచ్చాడు కరుణానిధి. అయితే  ఆయన అప్పటికీ  సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాల్లో  క్రియాశీలకంగా ఉంటున్న కాలంలో కూడ  పది నిమిషాల్లోనే కరుణానిధి పాట రాయడాన్ని సినీ వర్గాలు గుర్తుకు తెచ్చుకొంటున్నాయి.

కరుణానిధిని మాటల మాంత్రికుడిగా  చెబుతుంటారు. తన మాటలతో ప్రజలను ఆకట్టుకొనే శక్తి కరుణానిధికి ఉంది. కరుణానిధి తొలి నాళ్లలో సినిమాల్లో పనిచేసే .సమయంలో  సినిమాలకు మాటలు, స్క్రిప్టులు, పాటలు రాసేవారు.  ఆ తర్వాత రాజకీయాల్లో బిజీగా  మారిన తర్వాత సినిమాలకు రాయడం పూర్తిగా మానేశారు.

అయితే 18 ఏళ్ల క్రితం కరుణానిధి పది నిమిషాల్లో ఓ సినిమాకు పాట రాశాడు. రాజకీయాల్లో పూర్తి కాలంగా ఉంటున్న సమయంలో కూడ 76 ఏళ్ల వయస్సులో  సందర్భం, పరిస్థితిని చెబితే  పది నిమిషాల్లో కరుణానిధి పాటను రాసిచ్చాడు.  

కరుణానిధిలో ఉన్న రచనా శక్తికి ఈ ఘటనను నిదర్శనంగా చెబుతుంటాయి తమిళ సినీ వర్గాలు .ఈ పాటను కరుణానిధి రెండువేల సంవత్సరంలో ఓ దర్శకుడి వినతి మేరకు  పది నిమిషాల్లోనే రాశాడు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా