ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే?

Published : Sep 30, 2018, 11:43 AM ISTUpdated : Sep 30, 2018, 11:44 AM IST
ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే?

సారాంశం

ఆర్ఎక్స్ 100 సినిమాతో ఎవరు ఊహించని విధంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఇకపోతే అతను నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్టుతో వస్తాడా అని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు సంబందించిన కొన్ని రూమర్స్ కూడా మీడియాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. 

ఆర్ఎక్స్ 100 సినిమాతో ఎవరు ఊహించని విధంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఇకపోతే అతను నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్టుతో వస్తాడా అని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు సంబందించిన కొన్ని రూమర్స్ కూడా మీడియాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అజయ్ త్వరలోనే మల్టీస్టారర్ చేసే అవకాశం ఉన్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి. 

యువ హీరో రామ్ మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లకు ఆల్ రెడీ కథ కూడా వినిపించినట్లు టాక్ వచ్చింది. ఇక రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం అజయ్ ఆ ప్రాజెక్టును పక్కనపెట్టేసి నితిన్ తో చేయడానికి ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే అజయ్ ఆ ప్రాజెక్ట్స్ గురించి ఎక్కువగా స్పందించకుండా ఒక విషయాన్నీ చెప్పాడు. 

ప్రస్తుతం తాను ఒక ఒక కథ రాస్తున్నాను అని ఇంకా ఆ ప్రాజెక్టుకు సంబందించిన విషయాలు ఏవి ఫైనల్ అవ్వలేదని ఒక ఇంగ్లీష్ పత్రికకు తెలిపాడు. అదే విధంగా త్వరలోనే తన నెక్స్ట్ ప్రాజెక్టు గురించి తప్పకుండా అధికారికంగా తెలుపుతానని అప్పటివరకు ఎలాంటి రూమర్స్ నమ్మవద్దని అజయ్ క్లారిటీ ఇచ్చాడు.    

 

 

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్