
రూపా గంగూలి నటిస్తున్న ‘అనుపమ’ టీవీ డ్రామా సిరీస్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ షో టీఆర్పీ రేటింగ్ సైతం రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. ఈ షోలో నటిస్తున్న అందరికీ ఈ క్రెడిట్ దక్కుతుందని, ముఖ్యంగా రూపాలీ గంగూలీదే ఆ ఘనత అని అంటున్నారు. ‘అనుపమ’ ఇప్పుడు దేశంలోని పల్లెపల్లెను తాకింది. ఈ షోకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. దీనికి పాప్యులారిటీ రావడం వెనకున్న రూపా గంగూలీ రెమ్యునేషన్ పై చర్చ మొదలైంది.
‘బాలీవుడ్ లైఫ్’ వెబ్ సైట్ లెక్కల ప్రకారం.. రూపాలీ గంగూలీ మొదట్లో రోజుకు లక్షన్నర రూపాయలు పారితోషికంగా తీసుకునేవారు. అప్పట్లో అదే అత్యధికమైనా ఆమె సీనియర్ నటిగానే ఉండిపోయారు. ప్రస్తుతం ‘అనుపమ’గా ఆమె క్రేజ్ , రేంజ్ ఓ స్థాయికి చేరుకోవడంతో ఇప్పుడు రోజుకు 3 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట.
దాంతో భారత టెలివిజన్ రంగంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటిగా ఆమె రికార్డులకెక్కారు. ఇప్పటి వరకు ఈ జాబితాలో యువ నటీనటుల పేర్లు వెనక్కి వెళ్లిపోయాయి. అంతేకాదు, రామ్ కపూర్, రోణిత్ బోస్ రాయ్ వంటి వారిని కూడా రూపా గంగూలీ వెనక్కి నెట్టేశారు. 44 ఏళ్ల ఈ నటి కొన్ని నెలల క్రితమే తన రెమ్యునేషన్ ని పెంచినట్టు ఇండస్ట్రీ టాక్. షోలో ఆమె అద్వితీయ నటనకు ఈ మొత్తం సరైనదేనన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
రాజన్ షాహీ, దీపా షాహీ ప్రొడక్షన్ కంపెనీ కుట్ ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యంలో రమేష్ కొర్ల ఈ షోకు దర్శకత్వం వహిస్తున్నారు. తన భర్త వివాహేతర సంబంధం కారణంగా చితికిపోయిన గృహిణి కథ ఇది. పిల్లల గౌరవానికీ దూరమైన అనుపమ చివరికి తన సంతోషం కోసం తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటుంది. ఈ షో ఇతివృత్తం ఇదే. స్టార్ ప్లస్‌లో ప్రసారమవుతోంది.