
2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. హిందీలో తాజాగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించి తెలుగు సినిమా స్టామినా ఏంటో చూపించింది. ఊహించని విధంగా బాలీవుడ్‌లో అంచనాలకు మించి రాణిస్తున్న పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీకి ఈ తరహా రెస్పాన్స్ రావడం సెన్సేషన్ కాగా.. ఈ ఒకే ఒక్క సినిమాతో అతను పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. హిందీలో ఏదో మాములుగా ఆడుతుంది అనుకున్నారు.
కానీ ఈ స్దాయి సక్సెస్ అల్లు అర్జున్ ఊహించలేదని కొందరంటున్నారు. అందుకే పెద్దగా పబ్లిసిటీ లేకుండా నార్త్ లో రిలీజ్ చేసాడంటున్నారు. దాంతో ఆయన తన టీమ్ కు పార్టీల మీద పార్టీలు ఇస్తున్నారట. సుకుమార్ ని అయితే వదలిపెట్టడం లేదట. పుష్ప 2 మామూలుగా ఉండకూడదు అని పదే పదే చెప్తున్నారట. సక్సెస్ ఎలాంటి కిక్ ఇస్తుందో మనకు తెలిసిందే. అదే బన్ని విషయంలో జరుగుతోంది. తను పడిన కష్టానికి సరైన ఫలితం దొరికింది. నార్త్ మొత్తం పుష్ప మానియాలో ఊగిపోతోంది.
డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ఒకటిన్నర నెల రోజుల తర్వాత కూడా నార్త్ లో కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. ఒకపక్క హిందీ మినహా మిగతా బాషలలో ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చినా థియేటర్లలో కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ చిత్రానికి సర్వత్రా పాజిటివ్ టాక్ రావడం విశేషం. ఈ చిత్రం సౌత్ మరియు హిందీ బాషల్లో ఓటిటి లో అందుబాటులో ఉన్నా కూడా మంచి వసూళ్లను రాబడుతోంది.
అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కి ఈ తరహా రెస్పాన్స్ రావడం సెన్సేషన్ అని చెప్పాలి. ఈ చిత్రం లో రష్మీక మందన్న హీరోయిన్ గా నటించగా, సమంత స్పెషల్ సాంగ్ లో నటించడం జరిగింది. సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్ ఘోష్, ఫహద్ ఫజిల్ తదితరులు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం రెండవ భాగం పుష్ప ది రూల్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.