బిగ్‌బాస్‌4 ఫేమ్‌ సోహైల్‌ సరసన హీరోయిన్‌ ఫిక్స్..

Published : Mar 29, 2021, 03:11 PM IST
బిగ్‌బాస్‌4 ఫేమ్‌ సోహైల్‌ సరసన హీరోయిన్‌ ఫిక్స్..

సారాంశం

బిగ్‌బాస్‌4 ఫేస్‌ సోహైల్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇది షూటింగ్‌ని ప్రారంభించుకుంది. తాజాగా ఈ చిత్రంలో సోహైల్‌ సరసన నటించే హీరోయిన్‌ ఫిక్స్ అయ్యింది. `ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య` చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రూప కొడువయూర్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

బిగ్‌బాస్‌4 ఫేస్‌ సోహైల్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇది షూటింగ్‌ని ప్రారంభించుకుంది. తాజాగా ఈ చిత్రంలో సోహైల్‌ సరసన నటించే హీరోయిన్‌ ఫిక్స్ అయ్యింది. `ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య` చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రూప కొడువయూర్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. హోలీ పండుగ సందర్భంగా చిత్ర బృందం ఈ విషయాన్ని ప్రకటించింది. శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకత్వం వహించారు. మైక్ మూవీస్ నిర్మాణంలో అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి నిర్మిస్తున్నారు. 

`జార్జ్ రెడ్డి`, `ప్రెజర్ కుక్కర్` లాంటి సినిమాలతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న మైక్ మూవీస్ మరో వినూత్న కథతో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తోంది. ఇవాళ్టి సొసైటీలో ఓ బర్నింగ్ ఇష్యూను కథలో చూపించబోతున్నారు. ప్రతి మహిళ గర్వపడే విధంగా సినిమా ఉంటుందని హీరో సొహైల్ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చెప్పారు. ఇప్పటివరకు భారతదేశ చిత్ర చరిత్రలో రాని ఓ కొత్త పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు గతంలో తెలిపారు. 

నిర్మాతలు అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి, భారీ బడ్జెట్ తో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రంలోని ఇతర నటీనటులను త్వరలో ప్రకటించనున్నారు.ఈ చిత్రానికి  మ్యూజిక్ : శ్రావణ్ భరధ్వాజ్, సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ,  ఆర్ట్: గాంధీ నడికుడికార్, నిర్మాతలు: అప్పిరెడ్డి, సజ్జల  రవిరెడ్డి, రచన,దర్శకత్వం: శ్రీనివాస్ వింజనంపాటి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?
Soori Apologizes: అభిమానికి క్షమాపణ చెప్పిన కమెడియన్.. షూటింగ్ స్పాట్‌లో ఏం జరిగింది?