హోలీ విషెస్‌ చెబుతూ, ఐశ్వర్యా రాయ్‌, ఆరాధ్యలతో థ్రోబ్యాక్‌ ఫోటోని పంచుకున్న అభిషేక్‌..వైరల్‌

Published : Mar 29, 2021, 02:45 PM IST
హోలీ విషెస్‌ చెబుతూ, ఐశ్వర్యా రాయ్‌, ఆరాధ్యలతో థ్రోబ్యాక్‌ ఫోటోని పంచుకున్న అభిషేక్‌..వైరల్‌

సారాంశం

అభిషేక్‌ బచ్చన్‌ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. థ్రోబ్యాక్‌ ఫోటోని పంచుకుంటూ విషెస్‌ తెలియజేయడం విశేషం. ఐశ్వర్యా రాయ్‌, ఆయన కూతురు ఆరాధ్యలతోపాటు అభిషేక్‌ సరదాగా హోలీ జరుపుకుంటున్నట్టుగా ఉన్న ఈ ఫోటో వైరల్‌ అవుతుంది.

అభిషేక్‌ బచ్చన్‌ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. థ్రోబ్యాక్‌ ఫోటోని పంచుకుంటూ విషెస్‌ తెలియజేయడం విశేషం. ఐశ్వర్యా రాయ్‌, ఆయన కూతురు ఆరాధ్యలతోపాటు అభిషేక్‌ సరదాగా హోలీ జరుపుకుంటున్నట్టుగా ఉన్న ఈ ఫోటో వైరల్‌ అవుతుంది. ఇందులో గతంలో హోలీని ఎంత ఆనందంగా, సురక్షితంగా జరుపుకున్నాము, ఎంత స్వేచ్ఛగా జరుపుకున్నామో గుర్తు చేసుకున్నారు. 

ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ హోలీ విషెస్‌ తెలిపారు. `ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు. అత్యంత అందమైన ఫెస్టివల్‌ని సెలబ్రేట్‌ చేసుకోండి. కానీ సురక్షితంగా చేసుకోండి. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుననాయి. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోనే ఉండండి. మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోండి, ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి` అని చెప్పారు. ఇందులో మై గర్స్ అంటూ యాష్‌ ట్యాగ్‌ పంచుకున్నారు. ఈ సందర్బంగా అభిషేక్‌ పంచుకున్న ఫోటో వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం ఆయన `ది బిగ్‌ బుల్‌`,`బాబ్‌ బిశ్వాస్‌`,`దాస్వి` చిత్రాల్లో నటిస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?
ర‌జినీకి త‌ల్లిగా, ల‌వ‌ర్‌గా, భార్య‌గా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా