‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సంక్రాంతికైతే గిప్ట్ లేదు కానీ...

By Surya Prakash  |  First Published Jan 12, 2021, 2:42 PM IST

అయితే న్యూ ఇయిర్ సందర్భంగా ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఏదైనా విడుదల చేస్తారని భావించినా, ‘ఈ ఏడాది మీకు అద్భుతమైన ఎక్సపీరియన్స్  ఇస్తాం’ అంటూ విషెష్ చెబుతూ పోస్టర్‌ను మాత్రం షేర్ చేసారు. దీంతో ప్రస్తుతం అటు రామ్‌చరణ్‌, ఇటు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ సంక్రాంతి గిప్ట్ కోసం వేచి చూస్తున్నారు. అయితే సంక్రాంతి ఎలాంటి స్పెషల్స్ ఉండబోవని తెలుస్తోంది. 
 
సినీ అభిమానులంతా ఆశగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీజర్‌ కోసం చూస్తున్న సంగతి తెలిసిందే.  దానికి తోడు ‘ఇక నుంచి ప్రతి పండగకు మీకో సర్‌ప్రైజ్‌ తప్పకుండా ఉంటుంది’ -కరోనా తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ మొదలైన సందర్భంగా చిత్రం టీమ్  చెప్పిన మాట అభిమానుల గుండెల్లో అలా ముద్రైపోయింది. అప్పుడు అన్నట్లుగానే వెంటనే షూటింగ్‌ ప్రారంభించి, కొమరం భీమ్‌గా నటిస్తున్న ఎన్టీఆర్‌ టీజర్‌ను విడుదల చేశారు. ఆ టీజర్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత పెద్దగా హడావిడి కనిపించలేదు. 

అయితే న్యూ ఇయిర్ సందర్భంగా ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఏదైనా విడుదల చేస్తారని భావించినా, ‘ఈ ఏడాది మీకు అద్భుతమైన ఎక్సపీరియన్స్  ఇస్తాం’ అంటూ విషెష్ చెబుతూ పోస్టర్‌ను మాత్రం షేర్ చేసారు. దీంతో ప్రస్తుతం అటు రామ్‌చరణ్‌, ఇటు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ సంక్రాంతి గిప్ట్ కోసం వేచి చూస్తున్నారు. అయితే సంక్రాంతి ఎలాంటి స్పెషల్స్ ఉండబోవని తెలుస్తోంది. 

Latest Videos

జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా టీజర్‌ను విడుదల చేసే ప్లాన్‌ చేస్తున్నారట దర్శకుడు రాజమౌళి. స్వాతంత్ర్య సంగ్రామం నాటి కథ కావడంతో ఆ రోజును విడుదల చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట.  ఇందుకోసం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్‌ పరిచయ టీజర్‌కు ఎన్టీఆర్‌ వాయిస్‌ ఇవ్వగా, కొమరం భీమ్‌గా నటిస్తున్న ఎన్టీఆర్‌ పరిచయ టీజర్‌కు చెర్రీ వాయిస్‌ ఇచ్చారు. ఇక త్వరలో విడుదల చేయబోయే టీజర్‌కు  స్టార్ హీరో మెగాస్టార్‌తో వాయిస్‌ చెప్పించాలని చిత్ర టీమ్ ప్లాన్ చేస్తోందట. ఫిల్మ్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన లేదు. 

click me!