ఇంత బిజీలో కూడా పవన్ నిర్మాతగా కూడా ఇప్పుడు సినిమా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వరుణ్ తేజ్ హీరోగా ఆయన ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి కిశోర్ కుమార్ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ అయిందనీ, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ చెబుతున్నారు. గతంలో పవన్ నటించిన 'గోపాల గోపాల' చిత్రానికి,కాటమరాయుడు సినిమాకీ డాలీ దర్శకత్వం వహించిన సంగతి విదితమే.
వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే 'వకీల్ సాబ్' చిత్రాన్ని పూర్తిచేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రేపటి నుంచి క్రిష్ దర్శకత్వంలో రూపొందే సినిమా షూటింగులో జాయిన్ అవుతున్నారు. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. అలాగే మరోపక్క, 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ తో పాటు హరీశ్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
ఇంత బిజీలో కూడా పవన్ నిర్మాతగా కూడా ఇప్పుడు సినిమా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వరుణ్ తేజ్ హీరోగా ఆయన ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి కిశోర్ కుమార్ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ అయిందనీ, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ చెబుతున్నారు. గతంలో పవన్ నటించిన 'గోపాల గోపాల' చిత్రానికి,కాటమరాయుడు సినిమాకీ డాలీ దర్శకత్వం వహించిన సంగతి విదితమే.
వకీల్ సాబ్ విషయానికి వస్తే ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తిచేసుకుంది. చిత్రయూనిట్ తాజాగా గుమ్మడికాయ కొట్టేసింది. దర్శకుడు శ్రీరామ్ వేణు ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పై దృష్టి సారించారు. ఈ వేసవి నాటికి వకీల్ సాబ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోనీ కపూర్ సమర్పకుడు. ఇందులో పవన్ సరసన శ్రుతిహాసన్ కథానాయిక. వకీల్ సాబ్ మాతృక 'పింక్'లో అమితాబ్ బచ్చన్ కు కథానాయిక లేకపోయినా, పవన్ ఇమేజ్ దృష్ట్యా కథలో కొద్దిగా మార్పులు చేసి హీరోయిన్ పాత్ర తీసుకువచ్చారు. ఇక, కథకు కీలకమైన పాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల నటించారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. జనవరి 14న వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.