రామ్ చరణ్ కు గాయం.. RRR షూటింగ్ వాయిదా!

Published : Apr 03, 2019, 04:53 PM ISTUpdated : Apr 03, 2019, 05:02 PM IST
రామ్ చరణ్ కు గాయం.. RRR షూటింగ్ వాయిదా!

సారాంశం

టాలీవుడ్ బడా మల్టీస్టారర్ RRR కి మొదటిసారి బ్రేక్ పడింది. రామ్ చరణ్ గాయపడటంతో చిత్ర యూనిట్ షూటింగ్ ను క్యాన్సిల్ చేసి మరో తేదికి వాయిదా వేసింది.

టాలీవుడ్ బడా మల్టీస్టారర్ RRR కి మొదటిసారి బ్రేక్ పడింది. రామ్ చరణ్ గాయపడటంతో చిత్ర యూనిట్ షూటింగ్ ను క్యాన్సిల్ చేసి మరో తేదికి వాయిదా వేసింది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

అయితే ఇటీవల జిమ్ లో వర్కౌట్ చేస్తోన్న రామ్ చరణ్ ఊహించని విధంగా గాయపడ్డాడు. చీలమండ గాయం వల్ల పాదం దెబ్బతినడంతో చరణ్ నడవలేని పరిస్థితిలో ఉన్నట్లు చెబుతూ.. అందుకే పూణే షెడ్యూల్ ని ఆపేసినట్లు చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది. 

ఇక చరణ్ కోలుకోగానే ఆ షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తామని వివరణ ఇచ్చారు. దాదాపు 3 వారల వరకు చరణ్ కు రెస్ట్ అవసరమని జక్కన్న షూటింగ్ ని ఆఫ్ చేశారు

PREV
click me!

Recommended Stories

ఆ స్టార్ హీరోతో మూవీ నా కెరీర్‌కు మైలురాయి: అనన్య నాగళ్ల
ప్రభాస్ గెస్ట్ రోల్‌లో నటించిన ఏకైక బాలీవుడ్ సినిమా ఏంటో తెలుసా.? హీరో ఎవరంటే.!