RRR నిర్మాత దానయ్య కొడుకు పెళ్లి.. సమతతో ఏడడుగులు 

Published : May 20, 2023, 04:26 PM IST
RRR నిర్మాత దానయ్య కొడుకు పెళ్లి.. సమతతో ఏడడుగులు 

సారాంశం

ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య ఇంట పెళ్లి భాజాలు మోగుతున్నాయి. దానయ్య కుమారుడు కళ్యాణ్ నేడు శనివారం జరగబోయే వివాహ వేడుకతో ఓ ఇంటివాడు కాబోతున్నారు.

ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య ఇంట పెళ్లి భాజాలు మోగుతున్నాయి. దానయ్య కుమారుడు కళ్యాణ్ నేడు శనివారం జరగబోయే వివాహ వేడుకతో ఓ ఇంటివాడు కాబోతున్నారు. దానయ్య కుమారుడి పెళ్లి వేడుకకి టాలీవుడ్ ప్రముఖ సెలెబ్రిటీలంతా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. 

దానయ్య కుమారుడు కళ్యాణ్.. సమత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఫామిలీ బ్యాగ్రౌండ్ వివరాలు బయటకి రాలేదు. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో ఈ వివాహ వేడుక జరగనుంది. ఇదిలా ఉండగా దానయ్య కుమారుడు కళ్యాణ్ హీరోగా కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. 

ప్రస్తుతం కళ్యాణ్ జాంబిరెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అధీరా అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దానయ్యే ఈ చిత్రాన్నిస్వయంగా నిర్మిస్తూ తన తనయుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారు. 

ఇదిలా ఉండగా దానయ్య ఆర్ఆర్ఆర్ చిత్రం నిర్మించడంతో ఆయన పేరు మారుమోగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయంగా ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ లాంటి అద్భుతమైన అవార్డులు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం దానయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజీత్ దర్శకత్వంలో ఓజి అనే యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర అనౌన్సమెంట్ నుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

కెరీర్ మొత్తం అలాంటి సినిమాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్న బాలయ్య హీరోయిన్.. సూపర్ హిట్ మూవీపై విమర్శలు
రాజమౌళి తో రెండు సినిమాలు మిస్సైన అన్ లక్కీ స్టార్ హీరో ఎవరో తెలుసా?