NTR-Prabhas:ఆఫ్ ది రికార్డు... రాజమౌళి, చరణ్ తో ప్రభాస్ గురించి ఎన్టీఆర్ డిస్కషన్ లీక్

Published : Mar 18, 2022, 08:14 AM IST
NTR-Prabhas:ఆఫ్ ది రికార్డు... రాజమౌళి, చరణ్ తో ప్రభాస్ గురించి ఎన్టీఆర్ డిస్కషన్ లీక్

సారాంశం

ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు టీం. దర్శకుడు రాజమౌళి తన ఇద్దరు హీరోలతో దేశవ్యాప్తంగా ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. అఫీషియల్ ఇంటర్వ్యూకి ముందు చరణ్, రాజమౌళితో ఎన్టీఆర్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అలాగే దుబాయ్ లో కూడా ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. కాగా కెమెరా వెనుక రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ ఎలా పిలుచుకుంటారు. వారు ఒకరితో మరొకరు ఎలా మెలుగుతారు. అసలు ఆర్ ఆర్ ఆర్ మూవీతో పాటు ఇతర హీరోల గురించి ఎలాంటి కామెంట్స్ చేస్తారు అనేది బయటపడింది. ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ టీం ఈ ముగ్గురు ఆఫ్ ది రికార్డు వీడియో విడుదల చేశారు. 

అరగంట ఉన్న ఈ వీడియోలో ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి (Rajamouli)అనేక విషయాల గురించి చర్చించుకున్నారు. ఈ ప్రమోషన్స్ కోసం తిరగలేక నాపనైపోయిందని ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కాసేపు బెంగుళూరు ప్రమోషనల్ ఈవెంట్ లో చరణ్, తారక్ ధరించే బట్టల గురించి రాజమౌళి అడిగి తెలుసుకున్నారు. ఈవెంట్ లో ఉపయోగించే లైట్స్ కలర్స్ కి హైలెట్ అయ్యేలా మీ షర్ట్స్ కలర్స్ ఉండాలని ఆయన సలహా ఇచ్చారు. కాసేపటి తర్వాత ఇద్దరికీ చరణ్ స్వయంగా కాఫీ తెచ్చి ఇచ్చారు. కాఫీ స్మెల్ బాగుంటుంది కానీ.. టేస్ట్ అంతగా బాగోదని రాజమౌళి తెలియజేశారు. 

ఇక అభిమానుల మధ్య ఆర్ ఆర్ ఆర్ మూవీ చూసే డిస్కషన్ కొంత సేపు నడించింది. అసలు ఎప్పుడైనా ఫ్యాన్స్ మధ్య మూవీ చూశారా? అని రాజమౌళి అడుగగా... చిరుత మూవీ చూశానని చరణ్ (Ram Charan)చెప్పాడు. ఎన్టీఆర్ నేను ఇంతవరకు చూడలేదు. కానీ చూడాలన్న ఆశ మాత్రం ఉంది అన్నారు. మారు వేషంలో వెళ్లి మూవీ చూద్దాం. రజినీకాంత్ అలానే చేసేవారట.. అని చరణ్ సలహా ఇచ్చారు.  

ఈ క్రమంలో ప్రభాస్ (Prabhas)గురించి డిస్కషన్ వచ్చింది. ఎన్టీఆర్ మన ప్రభాస్ ప్రీమియర్ చూడడానికి వస్తాడా? అని అడిగారు. దానికి ప్రభాస్ ప్రత్యేకంగా ప్రీమియర్ కి రావడమా? అది జరగదని రాజమౌళి అన్నాడు. అయితే చరణ్ తీసుకు వస్తాడని ఎన్టీఆర్ అన్నారు. తర్వాత లేదంటే మనం తీసుకువద్దాం అని ఎన్టీఆర్ సలహా ఇచ్చాడు. ప్రభాస్ బాగా బద్దకస్తుడు ఆయన రావడం కష్టమే అన్న అర్థంలో రాజమౌళి రాడని చెప్పారు. ఎన్టీఆర్ మాత్రం ఎలాగైనా ప్రీమియర్ షోకి తీసుకువద్దామన్న అభిప్రాయం వెల్లడించారు. 

ఇక ఆర్ ఆర్ ఆర్ టీమ్ విడుదల చేసిన ఆఫ్ ది రికార్డు వీడియోలో ఈ ముగ్గురి మధ్య అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. జంతువులతో ఫైట్స్ విషయంలో సహజంగా రావడానికి రాజమౌళి చేసిన రీసెర్చ్, వాడిన పరికరాలు, సాంకేతిక విషయాలు చర్చించారు. ఇక రాజమౌళి షూటింగ్ సమయంలో ఎంతగా హింసించారో కూడా చరణ్, ఎన్టీఆర్ (NTR)తెలిపారు. మొత్తంగా రాజమౌళి తన తెలివితేటలతో ఆర్ ఆర్ ఆర్ ని వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి