RRR:''ఆర్.ఆర్.ఆర్'' అసలు బడ్జెట్ ఎంతో చెప్పేసారు! విన్నవన్నీ రూమర్సే అన్నమాట

Surya Prakash   | Asianet News
Published : Mar 18, 2022, 06:50 AM IST
RRR:''ఆర్.ఆర్.ఆర్'' అసలు బడ్జెట్ ఎంతో చెప్పేసారు! విన్నవన్నీ రూమర్సే అన్నమాట

సారాంశం

  యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా ఈ నెల 25న సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలో ‘ట్రిపుల్ ఆర్’ మూవీ బడ్జెట్ ఎంత అన్న దానిపైనా సినీఫ్యాన్స్ లో విశేషంగా చర్చ సాగుతోంది.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఇందులో రామ్ చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామరాజు'గా.. తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్నారు. కోవిడ్ కారణంగా షూటింగ్ లేట్ అవడంతో ముందుగా చెప్పినట్లు  విడుదల చేయలేకపోయారు. ఎన్నో వాయిదాల తర్వాత రిలీజ్  ఈ నెల 25 న ఈ  చిత్రం రిలీజ్ అవుతోంది. సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్స్ క్రియేట్ చేసే జక్కన్న.. 'ఆర్.ఆర్.ఆర్' ని కూడా అదే స్థాయిలో తీర్చిదిద్దారని ఇప్పటికే రిలీజైన విజువల్స్ తో తెలుస్తోంది.

అలాగే రాజమౌళి సినిమా అంటే గ్రాఫిక్స్ వర్క్ కి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'యమదొంగ' 'మగధీర' 'ఈగ' 'బాహుబలి' సినిమాలలో అబ్బురపరిచే విజువల్స్ అందించారు. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' లో కూడా వీఎఫ్ఎక్స్ వర్క్ కి అధిక సమయం కేటాయించాని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో  ఈ  చిత్రం బడ్జెట్ పై రకరకాల వార్తలు మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. అయితే అసలు ఈ సినిమాపై పెట్టిన  ఖర్చు ఎంత అనేది అఫీషియల్ గా రాజమౌళి తెలియచేసారు.

  టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు దర్శకనిర్మాతలు. మంత్రి పేర్ని నాని తాజాగా ‘ఆర్.ఆర్.ఆర్’ అసలు బడ్జెట్ ను రివీల్ చేశారు. పారితోషికాలు, జీఎస్టీ కాకుండా ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం మేకర్స్ రూ.336 కోట్లు ఖర్చు చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. దీంతో తమ సినిమాకి టికెట్ రేట్లు పెంచాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం కు వినతి పత్రం రాసినట్టు కూడా ఆయన తెలిపారు. ఈ మొత్తంలో సినిమాలో నటించిన యన్టీఆర్, రామ్‌చరణ్, అలియా భట్, దర్శకుడు రాజమౌళి పారితోషికాలు కలుపలేదట! అదీగాక జియస్టీ లేకుండానే రూ.336 కోట్లు.

 చిత్ర దర్శకుడు రాజమౌళి, నిర్మాత డి.వి.వి. దానయ్య ఏపీ సీఎమ్ జగన్మోహన రెడ్డిని ఈ చిత్రం బడ్జెట్ విషయమై కలిసి, ప్రస్తావించారు. ఆయన అందుకు సానుకూలంగా స్పందించి, ఆ సినిమా బడ్జెట్ ఎంత? దానికి అనుగుణంగా ఆ చిత్రానికి టిక్కెట్ రేటు ఎంత పెంచాలి అన్న అంశాలపై ఆలోచించి నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రికి, మంత్రి నానికి తమ సినిమా బడ్జెట్ వివరాలు తెలిపారు రాజమౌళి, దానయ్య. అందువల్ల నానికి అంత పక్కాగా ‘ట్రిపుల్ ఆర్’ నిర్మాణ వ్యయం ఎంతనో తెలిసి పోయింది. దాంతో ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అమలులో ఉన్న టిక్కెట్ రేట్లకు అదనంగా రూ.100 పెంచుకోవచ్చునని తేల్చింది.  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దాదాపు రూ.700 కోట్ల థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్, ఇతర బిజినెస్ చేసింది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?