
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి(Rajamouli) డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాఆర్‌ఆర్‌ఆర్. రిలీజ్ కు రెడీ అయిన ఈ పాన్ ఇండియా భారీ బడ్జెట్ మూవీ ప్రమోషన్స్ తో తెగ హడావిడి చేస్తున్నారు. గతంలో భారీ స్థాయిలో ప్రమోషన్ చేసి.. తప్పక రిలీజ్ డేట్ వాయిదా వేసుకోవల్సి వచ్చింది. ఇక మళ్లీ ఈ సినిమాకు సంబంధించిన హడావుడి షురూ అయింది. #RRRMassBegins పేరుతో సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ వీడియోను పోస్ట్ చేస్తున్నారు.
ట్రిపుల్ ఆర్(RRR) క్రేజ్ ఎంతలా ఉంది అంటే.. అది ఒక్క ఇండియాకే పరిమితం కాలేదు విదేశాల్లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉన్న క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఈసినిమా కోసం తాము ఎంతగానో వెయిట్ చేస్తున్నామంటూ ఫ్యాన్స్ రకరకాల రూపాల్లో తమ అభిమానాన్ని తెలుపుకుంటున్నారు. రీసెంట్ గా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కెనడాలో ఆర్ఆర్ఆర్(RRR) అభిమానులు తెగ సందడి చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ , ఎన్టీఆర్ పేర్లను కార్లతో వచ్చేలా రాసి... ఎన్టీఆర్‌కు అక్కడి ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ టీమ్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. సినిమా ప్రమోషన్ లో ఇది భాగం అయ్యింది. ఇలాంటి చాలా వీడియోస్ నెట్టింట్లో దర్శనం ఇస్తున్నాయి.
ఇక రాజమౌళి డైరెక్షన లో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్(NTR), అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్(Ram Charan) నటించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా.. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. ఇక అన్ని అడ్డంకులు తొలగిపోవడం.. కరోనా కూడా తగ్గడంతో ఈ నెల 25న ట్రిపుల్ ఆర్ ను రిలీజ్ చేయబోతున్నారు.
ట్రిపుల్ ఆర్ కోసం వరల్డ్ వైడ్ గా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి(Bahubali) తర్వాత రాజమౌళి(Rajamouli) రూపొందిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి భారీ ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న యంగ్ స్టార్స్ నటించడంతో ఆ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతే కాదు ఈ సినిమాలో సీతగా ఆలియా భట్ నటించగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, శ్రీయా కీలక పాత్రల్లో నటించారు.
ఇక ఇప్పటికే ట్రిపుల్ ఆర్ నుంచి రిలీజ్ అయిన టీజర్లు, మేకింగ్ వీడియోస్, ఇంట్రెడక్షన్ వీడియోస్, పోస్టర్స్, ఫైనల్ గా ట్రైలర్ కు కూడ ఎవరూ ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ను మళ్లీ మొదలెట్టారు. ఈరెండు వారాలు ట్రిపుల్ ఆర్ జాతర జరగబోతోంది. ఈసారి మరి ప్రమోషన్స్ లో ఇంకెంత వెరైటీ చూపిస్తారో రాజమౌళి అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతే కాదు కరోనా తరువాత ఈ సినిమా వల్ల.. థియేటర్లకు ఆడియన్స్ పెద్ద ఎత్తున వస్తారని అంచనాలు ఉన్నాయి.