RRR అప్డేట్ : 45 సెకండ్ల గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్.. తొలిసారి ఎన్టీఆర్, చరణ్ కలిసి

pratap reddy   | Asianet News
Published : Oct 30, 2021, 01:44 PM IST
RRR అప్డేట్ : 45 సెకండ్ల గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్.. తొలిసారి ఎన్టీఆర్, చరణ్ కలిసి

సారాంశం

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ యుద్దానికి అన్ని ఆయుధాలు సిద్ధం చేసుకుంటోంది. పోరాట యోధులుగా రాంచరణ్, ఎన్టీఆర్ యావత్ దేశాన్ని మెప్పించేందుకు రెడీ అవుతున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ యుద్దానికి అన్ని ఆయుధాలు సిద్ధం చేసుకుంటోంది. పోరాట యోధులుగా రాంచరణ్, ఎన్టీఆర్ యావత్ దేశాన్ని మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో రాంచరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. 

కరోనా ప్రభావంతో ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సంక్రాంతికి జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే జక్కన్న నెవర్ బిఫోర్ అనిపించే విధంగా RRR ప్రమోషన్స్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఆర్ఆర్ఆర్ చిత్రం పివిఆర్ సంస్థతో టై అప్ అవుతున్నట్లు ప్రకటించారు. అదే రోజు ఆర్ఆర్ఆర్ టీజర్ కి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వాల్సింది. కానీ పునీత్ మరణం కారణంగా వాయిదా వేశారు. 

తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఆసక్తికర ప్రకటనతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవంబర్ 1న ఉదయం 11 గంటలకు ఆర్ఆర్ఆర్ చిత్ర గ్లింప్స్ ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. 45 సెకండ్ల నిడివితో ఈ గ్లింప్స్ ఉండబోతోంది. దీనితో తొలి సారి Jr NTR, Ram Charan లని ఒకే ప్రేములో అభిమానులు చూడబోతున్నారు. 

Also Read: Puneeth rajkumar death: తల బాదుకుంటూ కన్నీరు మున్నీరైన బాలకృష్ణ.. పునీత్ పార్థివదేహం ముందు ఇలా

గతంలో రాంచరణ్ పాత్రని, ఎన్టీఆర్ పాత్రని పరిచయం చేస్తూ విడి విడిగా టీజర్స్  వదిలారు. ఆ టీజర్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. కానీ ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ కలసి కనిపించబోతుండడం ఇదే తొలిసారి. దీనితో నవంబర్ 1న విడుదల కాబోయే గ్లింప్స్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, సముద్రఖని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొదట ఈ చిత్రానికి 400 నుంచి 450 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్ర బడ్జెట్ 500 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. డివివి దానయ్య నిర్మాత. 

 

PREV
click me!

Recommended Stories

Mohan Babu చిరంజీవి అన్నదమ్ములుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Suma Rajeev Divorce: తల్లిదండ్రుల విడాకుల విషయంలో అసలు జరిగింది ఇదే.. చెప్పేసిన సుమ కొడుకు రోషన్