Puneeth rajkumar death: పునీత్ కడసారి చూపు కోసం.. బెంగళూరుకు చిరు, ఎన్టీఆర్, బాలయ్య

pratap reddy   | Asianet News
Published : Oct 30, 2021, 11:44 AM IST
Puneeth rajkumar death: పునీత్ కడసారి చూపు కోసం.. బెంగళూరుకు చిరు, ఎన్టీఆర్, బాలయ్య

సారాంశం

శనివారం సాయంత్రం Puneeth Rajkumar అంత్యక్రియలకు కర్ణాటక ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తన తండ్రి రాజ్ కుమార్ సమాధి పక్కనే పునీత్ కు కూడా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో యావత్ భారత చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండే పునీత్ మరణించడం ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేని అంశంగా మారిపోయింది. కన్నడ అభిమానులు పవర్ స్టార్, అప్పు అంటూ ముద్దుగా పిలుచుకునే పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శుక్రవారం జిమ్ లో కసరత్తులు చేస్తుండగా పునీత్ గుండెపోటుకు గురై మరణించారు. 

ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం Puneeth Rajkumar అంత్యక్రియలకు కర్ణాటక ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తన తండ్రి రాజ్ కుమార్ సమాధి పక్కనే పునీత్ కు కూడా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దాదాపు 6వేలమంది పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం పునీత్ పార్థివ దేహాన్ని కంఠీరవ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఇప్పటికే పునీత్ కు నివాళులు అర్పించారు. 

Also Read: పునీత్, అశ్విని దంపతుల లవ్ స్టోరీ.. ఆమె ఎందుకు ప్రేమించిందంటే, భర్తే పంచప్రాణాలు..

అన్ని చిత్రాల పరిశ్రమల నుంచి స్టార్ నటీనటులు.. రాజకీయ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు పునీత్ పునీత్ కడసారి చూపు కోసం బెంగళూరు పయనం అవుతున్నారు. ఇక తెలుగుతో పునీత్ కు విడదీయరాని అనుబంధం ఉంది. టాలీవుడ్ లో చాలామంది సినీ ప్రముఖులు పునీత్ కు స్నేహితులే. దశాబ్దాల కాలంగా పునీత్ ఫ్యామిలీతో మెగా, నందమూరి కుటుంబాలకు మంచి రిలేషన్ ఉంది. 

Also Read: Aryan Khan Released: జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్.. జైలుకు వద్దకు వచ్చిన షారుఖ్..భారీగా చేరుకున్న అభిమానులు

దీనితో చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు బెంగళూరుకు పయనం అవుతున్నారు. ఇప్పటికే Nandamuri Balakrishna బెంగుళూరుకు బయలుదేరారు. పునీత్ కడసారి చూపు కోసం Chiranjeevi, Jr NTR ఈ మధ్యాహ్నం బెంగళూరు వెళ్లనున్నారు. అలాగే నటులు నరేష్, శివ బాలాజీ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఇళయదళపతి విజయ్ కూడా పునీత్ అంత్యక్రియలకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Balakrishna Favourite : బాలయ్య కు బాగా ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకు ?
Prabhas: 2025 లో ఒక్క మూవీ లేని హీరో, కానీ చేతిలో 4000 కోట్ల బిజినెస్.. ఆ రెండు సినిమాలపైనే అందరి గురి ?