ప్రముఖ నటుడు అనుమాస్పద మృతి... ఇంట్లో ఉరికి వేలాడుతూ!

Published : Sep 11, 2021, 01:08 PM IST
ప్రముఖ నటుడు అనుమాస్పద మృతి... ఇంట్లో ఉరికి వేలాడుతూ!

సారాంశం

మోస్ట్ వాంటెడ్ టెలివిజన్ నటుడిగా రమేష్ పలు సీరియల్స్ లో నటిస్తున్నారు. రమేష్ కొన్ని మలయాళ చిత్రాలు కూడా చేయడం జరిగింది. మరణానికి రెండు రోజుల ముందు రమేష్ తన లేటెస్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ నుండి ఇంటికి రావడం జరిగింది. 

మలయాళ బుల్లితెర నటుడు రమేష్ వలియాసల మృతి చెందారు. ఆయన తిరువనంతపురంలోని తన నివాసంలో ఉరికి వేలాడుతూ కనిపించారు. రమేష్ మృతి సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలాన్ని చేరుకొని, కేసు రిజిస్టర్ చేశారు. రమేష్ ది అనుమాస్పద మృతిగా పోలీసులు ప్రాథమికంగా రిపోర్ట్ లో పొందుపరిచారు. 


మోస్ట్ వాంటెడ్ టెలివిజన్ నటుడిగా రమేష్ పలు సీరియల్స్ లో నటిస్తున్నారు. రమేష్ కొన్ని మలయాళ చిత్రాలు కూడా చేయడం జరిగింది. మరణానికి రెండు రోజుల ముందు రమేష్ తన లేటెస్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ నుండి ఇంటికి రావడం జరిగింది. ఇంతలోనే ఆయన విగతజీవిగా కనిపించడం పలువురిని కలచివేసింది. 


దాదాపు 22 ఏళ్లుగా రమేష్ మోస్ట్ సక్సెస్ ఫుల్ నటుడిగా బిజీ కెరీర్ కలిగి ఉన్నారు. కాలేజ్ డేస్ లో మిత్రులతో కలిసి, అనేక స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చారు. రమేష్ మరణవార్త తెలుసుకొని మలయాళ చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Daredevil: అజిత్ అభిమానులకు గుడ్ న్యూస్, షాలిని విషయంలో సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేసిన హీరో
Kiara Advani Festive Looks: పండగకి మెరిసిపోవాలా? కియారా బ్లింగ్ ఐడియాలు అదుర్స్..