
'బాహుబలి 2' తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా అనగానే తెలుగు వారిలోనే కాకుండా యావత్ భారత సినీ ప్రేమికులు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. జక్కన్న తదుపరి సినిమా ఎలా ఉంటుందా అంటూ అంతా ఇంట్రస్టింగ్ గా ఎదురు చూస్తున్న సమయంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో ఆర్.ఆర్.ఆర్ లతో వచ్చాడు. రాజమౌళి మూవీ కనుక ఖచ్చితంగా విజువల్ వండర్ గా ఉంటుందని అంతా భావించారు. అనుకున్నట్లుగానే సినిమా ఉంది కానీ మొదటి రోజు కథ సరిగ్గా లేదని డివైడ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ కుమ్మేసాయి. కానీ ఇది ప్యాన్ ఇండియా చిత్రం. దాంతో హిందీలో ఎంత కలెక్ట్ చేసిందనేది ట్రేడ్ వర్గాల్లో చర్చగా మారింది.
అందులోనూ బాహుబలి సిరీస్ తో నార్త్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలి 2 నార్త్ లో ఏకంగా తొలి రోజే 41 కోట్ల నెట్ ను వసూలు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ ఎంత వసూలు చేస్తుంది అన్నది ఇంట్రస్టింగ్ విషయమే. అలాగే సాహో చిత్రం తో పోలిక కూడా అనివార్యమైపోయింది.ఎందుకంటే తెలుగుకన్నా నార్త్ లోనే సాహో ఎక్కువ కలెక్ట్ చేసింది. బాహుబలి 2 తర్వాత విడుదలైన ప్యాన్ ఇండియన్ చిత్రం సాహో 25 కోట్ల నెట్ ను కలెక్ట్ చేసింది.
ఇక RRR మాత్రం సాహోను కూడా క్రాస్ చేయలేదు. ప్యాండెమిక్ తర్వాత విడుదలైన చిత్రాల్లో సెకండ్ బెస్ట్ ఓపెనింగ్ ను సాధించిన ఆర్ ఆర్ ఆర్ వివిధ కారణాల వల్ల తొలిరోజు తక్కువ వసూలు చేసింది. హిందీ ఆర్.ఆర్. ఆర్ చిత్రం 19 కోట్లు నెట్ కలెక్ట్ చేసిందని సమాచారం. అయితే ఇంకా తక్కువే వచ్చిందని బాలీవుడ్ అంటోంది. కాకపోతే రెండో రోజు శనివారం కలెక్షన్స్ స్టడీగా ఉన్నట్లు సమాచారం. ఈ రోజు కూడా కీలకమైనదే. టాక్ పాజిటివ్ గా స్ప్రెడ్ అయితే సినిమా నిలబడిపోతుంది.
RRR సినిమా వరల్డ్ వైడ్ గా భారీ గా రిలీజ్ అయ్యింది, సినిమా పై తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ నెలకొనగా ఇతర రాష్ట్రాలలో క్రేజ్ ను టీం సూపర్బ్ ప్రమోషన్స్ తో పెంచేసి భారీగా హైప్ ను తెచ్చే ప్రయత్నాలు చేశారు, దాంతో అన్ని చోట్లా మంచి బజ్ ను సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా…ఎలాగూ తెలుగు రాష్ట్రాలలో కర్ణాటకలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపడం ఖాయం. కానీ ఇతర రాష్ట్రాలలో ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదైనా అందరి దృష్టిలో హిందీ బెల్ట్ లో ఎలాంటి కలెక్షన్స్ ని ఏ స్దాయిలో సొంతం చేసుకుంది అనేది కీలకం.