Naga Shourya New Movie Teaser: టీజర్ ట్రీట్ కు రెడీ అయిన నాగశౌర్య, ఈసారైనా కలిసివస్తుందా...?

Published : Mar 27, 2022, 07:42 AM IST
Naga Shourya New Movie Teaser: టీజర్ ట్రీట్ కు రెడీ అయిన నాగశౌర్య,  ఈసారైనా కలిసివస్తుందా...?

సారాంశం

కరోనా టైమ్ అయిపోవడంతో యంగ్ హీరోలంతా స్పీడ్ పెంచారు. అందులో హ్యాండ్సమ్ స్టార్ నాగశౌర్య కూడా దూకుడు పెంచాడు. టీజర్ ట్రీట్ కు రెడీ అయ్యాడు శౌర్య. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. 

కరోనా టైమ్ అయిపోవడంతో యంగ్ హీరోలంతా స్పీడ్ పెంచారు. అందులో హ్యాండ్సమ్ స్టార్ నాగశౌర్య కూడా దూకుడు పెంచాడు. టీజర్ ట్రీట్ కు రెడీ అయ్యాడు శౌర్య. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. 

టాలీవుడ్ యంగ్ స్టార్ నాగశౌర్య వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నుడు, ఛలో తరువాత అంత స్థాయిలో శౌర్యకు హిట్ రాలేదు. రీసెంట్ గా వరుడు కావలెను, లక్ష్య సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కోట్టాయి. ప్రయోగాలు చేయడానికి కూడా వెనకాడలేదు శౌర్య. సినిమాల కోసం చాలా కష్టపడ్డాడు. ఆకరికి సిక్స్ ప్యాక్ తో కూడా ఆకర్శించాలి అని చూశాడు, స్పెర్డ్స్ డ్రామా కథతో సినిమాను చేశాడు. కాని ఈ సినిమా కూడా కలిసి రాలేదు నాగశౌర్య. 

ఇక  ఇప్పుడు మరో ప్రయోగంతో ఆడియన్స్ ను అలరించడానికి రాబోతున్నాడు నాగశౌర్య. ఈ సినిమాలో యంగ్ హీరో డిఫరెంట్ లుక్ తో  కనిపించబోతున్నాడు. కృష్ణ వ్రింద విహారి టైటిల్ తో సినిమా చేస్తున్నాడు నాగశౌర్య,  ఈసినిమాకు అనీశ్ కృష్ణ డైరెక్షన్ లో రూపొందిస్తున్నాడు. నాగశౌర్య సొంత బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లవ్ తో కూడిన ఫ్యామిలీ ఎమోషన్స్ తో  తెరకెక్కిస్తున్న ఆసినిమాకు  మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

ఈ సినిమాలో నాగశౌర్య సరసన షిర్లే సెటియా హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాతో ఆమె ఇండస్ట్రీకి  పరిచయం కానుంది. ఈ సినిమా ఫస్ట్ నుంచీ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తూ వస్తోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన  పోస్టర్లు డిఫరెంట్ గా ఉండటంతో సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక ఇప్పుడు టీజర్ ట్రీట్ కు రెడీ అయ్యాడు నాగశౌర్య, టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు టీమ్. ఈ నెల 28 న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటిస్తూ, పోస్టర్ ను రిలీజ్ చేశారు.

 ఇక సీనియర్ నటి రాధిక ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. ఏప్రిల్ 22వ తేదీన ఈ సినిమాను  థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ సీజన్ లో ధైర్యం చేసి పోటీకి దిగుతున్నాడు నాగశౌర్య.  ఈ మధ్య కాలంలో వరుస ఫెయిల్యూర్స్ తో  సతమతమవుతున్న నాగశౌర్యకి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌