
ఎప్పుడూ ఎదో ఒక విషయంలో సడెన్ గా సంచలనంతో సందడి చేస్తుంటాడు యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్. ఈసారి ఏకంగా యూపీ సీఎంతోనే మంతనాలు మొదలెట్టాడు బండ్ల.
టాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రోడ్యూసర్ బండ్ల గణేశ్ షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. లోకల్ గా రాజకీయాల్లో వేలు పెట్టి చాలా సార్లు ఇబ్బందుల్లో పడ్డ బండ్ల.. కోరి సమస్యలను కొని తెచ్చుకున్నారు. ఆయన మైకు ముందుకు వచ్చాడంటే ఏదో ఒక కాంట్రవర్సీ బ్లాస్ట్ అయినట్టే. సినిమాల విషయంలో కూడా బండ్ల గణేష్ మాటలు కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తుంటాయి. ఇక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు కలిసి రావడం లేదు అనుకున్నాడో ఏమో.. జాతీయ రాజకీయాల వైపు దృష్టి పెట్టాడు బండ్ల.
జాతీయ స్థాయి రాజకీయ నేతల దగ్గర బండ్ల గణేష్ కు మంచి పలుకుబడే ఉన్నట్టుంది. గతంలో పలువురు కీలక నేతలతో ఇలా వెళ్లి అలా కలిసి వచ్చిన ఆయన తాజాగా.. ఉత్తరప్రదేశ్‌కు వరుసగా రెండో సారి సీఎంగా పదవీ ప్రమాణం చేసిన యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఫొటో దిగారు. ఆ ఫొటోను స్వయంగా బండ్ల గణేశ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌కు వరుసగా రెండో సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్‌కు శుభాకాంక్షలు తెలిపిన బండ్ల.. పరమేశ్వరుడు ఆయనకు ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ ఫొటోను చూసిన వారు బండ్ల గణేశ్ రాజకీయంగా మంచి సంబంధాలే ఉన్నట్టున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. బండ్లన్నా నువ్వుసూపర్ అంటున్నారు.
ఇక బండ్ల గణేష్ ప్రస్తుతం కామ్ గా తన పనితాను చూసుకుంటున్నాడు ఎక్కువగా ఎందులోను బండ్ల జోక్యం చేసుకోవడం లేదు. అయితే పవన్ కల్యాణ్ కు పరమ భక్తుడు అయిన బండ్ల.. భీమ్లా నాయక్ విషయంలో కామ్ అయ్యాడు. ప్రీ రిలీజ్ కు కూడా వెళ్ళకపోవడం ఆశ్చర్యం కలిగించింది. పవన్ తో బండ్ల ఓ సినిమా చేయాల్సి ఉంది.