ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ డిలీటెడ్ సీన్ చూశారా.. వైరల్

Published : Aug 03, 2024, 11:10 PM IST
ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ డిలీటెడ్ సీన్ చూశారా.. వైరల్

సారాంశం

నెట్ ఫ్లిక్స్ సంస్థ రాజమౌళిపై మోడ్రన్ మాస్టర్స్ ఎస్ ఎస్ రాజమౌళి అంటూ డాక్యుమెంటరీ చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ చిత్రానికి సంబంధించిన విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నెట్ ఫ్లిక్స్ సంస్థ రాజమౌళిపై మోడ్రన్ మాస్టర్స్ ఎస్ ఎస్ రాజమౌళి అంటూ డాక్యుమెంటరీ చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ చిత్రానికి సంబంధించిన విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళికి సినిమా పట్ల ఉన్న నిబద్దత, ఒక చిత్రం కోసం ఆయన ఎలా ఆలోచిస్తారు ఎంతలా కష్టపడతారు లాంటి అంశాలని చూపించారు. 

ఇందులో భాగంగా రాజమౌళి కెరీర్ బిగినింగ్ నుంచి ఆయన తెరకెక్కించిన అన్ని చిత్రాల ప్రస్తావన ఈ డాక్యుమెంటరీ చిత్రంలో ఉంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆర్ఆర్ఆర్ చిత్ర విశేషాలు కూడా ఉన్నాయి. 

 

ఇందులో ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ నటించిన ఒక డిలీటెడ్ సీన్ ని ప్రదర్శించారు. రాంచరణ్ ఈ సన్నివేశంలో ఎడ్లబండిపై ఎక్కి ఏదో విసురుతున్నాడు. అతడితో పాటు పోలీసులు కూడా కదులుతున్నారు. 

ఈ సన్నివేశంలో చూస్తూ రాంచరణ్ ఫ్యాన్స్ భలే ఖుషి అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ లో ఇంకెన్ని డిలీటెడ్ సీన్లు ఉన్నాయో.. వాటన్నింటిని చిత్ర యూనిట్ బయట పెడితే బావుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌