రేవ్ పార్టీ కేసులో బిగ్ బాస్ మెహబూబ్ అరెస్ట్ అయ్యాడా? సంచలన వీడియో వదిలిన యూట్యూబ్ స్టార్!

By Sambi Reddy  |  First Published Jul 31, 2024, 6:27 PM IST

రేవ్ పార్టీలో పాల్గొన్న బిగ్ బాస్ మెహబూబ్ అరెస్ట్ అయ్యాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. వీడియో బైట్ విడుదల చేశారు. 


బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ అరెస్ట్ అయ్యాడంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. ఆయన బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వాడారని, దాడి చేసిన అధికారులు మెహబూబ్ తో పాటు ఆయన మిత్రులను అదుపులోకి తీసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై మెహబూబ్ స్వయంగా స్పందించారు. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. వాస్తవంగా ఏం జరిగిందో తెలియజేశాడు. 

మెహబూబ్ మాట్లాడుతూ... జులై 29న నా జన్మదినం. బ్రదర్ ఒక సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశాడు. రిసార్ట్స్ వాళ్లకు లిక్కర్ పర్మిషన్ తీసుకోమని చెప్పాడట. వాళ్ళు తీసుకోలేదు. అన్ని రిసార్ట్స్ ని చెక్ చేసినట్లే మేము ఉన్న రిసార్ట్ ని కూడా పోలీసులు చెక్ చేశారు. లిక్కర్ కి పర్మిషన్ లేదు అన్నారు. దాన్ని తీసుకెళ్లిపోయారు. తర్వాత మేము బర్త్ డే పార్టీ చేసుకుని, భోజనం చేసి వచ్చేశాం. 

Latest Videos

undefined

కానీ మేము రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ప్రచారం చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ యూట్యూబ్ లింక్స్ పంపారు. ముఖ్యంగా పార్టీలో ఉన్న అమ్మాయిలను ఉద్దేశించి దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. అది నన్ను చాలా బాధపెట్టింది. ఎవరైతే ఫేక్ న్యూస్ ప్రచారం చేసి నా గౌరవానికి భంగం కలిగించాలని చూశారో... వాళ్ళ మీద నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను, అన్నారు. 

తాను ఫ్రెండ్స్ తో పాటు రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు, అరెస్ట్ అయినట్లు వస్తున్న వార్తలను మెహబూబ్ ఖండించాడు. యూట్యూబర్ గా పాప్యులర్ అయిన మెహబూబ్ బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ చేశాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పది వారాలకు పైగా హౌస్లో ఉన్నాడు. బీబీ జోడిలో శ్రీసత్యతో పాటు కంటెస్ట్ చేశాడు. మెహబూబ్ మంచి డాన్సర్ కావడం విశేషం. 

click me!