
బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తూ ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీ లెవల్ లో దూసుకుపోతోంది, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా పై తెలుగు లో అయితే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రిలీజ్ రోజు సెకండాఫ్ బాగోలేదోని డివైడ్ టాక్ స్ప్రెడ్ అయినా కలెక్షన్స్ హోరు, జోరు మాత్రం ఆగలేదు.
రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ రావడం తో ఆ ఇంపాక్ట్ సినిమా ప్రమోషన్స్ పై పడింది. సంక్రాంతి కి మిస్ అయినా ఇప్పుడు సమ్మర్ రేసులో వచ్చిన సినిమా కి మళ్ళీ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్ లో చేసిన జక్కన్న అన్ని చోట్ల కూడా ఫుల్ జోష్ వచ్చేలా చేసాడు అని చెప్పాలి. సినిమా తెలుగు రాష్ట్రాలలో మాత్రం సెన్సేషనల్ క్రేజ్ నడుమ రిలీజ్ అయ్యింది. నైజాం ఏరియాలో మొదటి రోజు 23.35 కోట్లు తెచ్చుకుని హిస్టరీ క్రియేట్ చేసింది.
రిలీజ్ కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజులో చేసి దుమ్ము దుమారం చేసింది. సినిమా ఒక్క నైజాం ఏరియాలోనే ఆల్ మోస్ట్ ప్రీవియస్… బిగ్గెస్ట్ మూవీస్ అన్నింటి కన్నా కూడా భారీ బిజినెస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించడం విశేషం, రీసెంట్ టైం లో నైజాం లో బిగ్ మూవీస్ కి 35 కోట్ల నుండి 40 కోట్ల రేంజ్ లో బిజినెస్ లు జరగగా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా కి ఇక్కడ ఏకంగా GST తో కలిపి 75 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయ్యింది. ఈ రేంజ్ లో బిజినెస్ అంటే అది మాములు విషయం కాదనే చెప్పాలి. చరిత్రలో నిలిచి పోయే బిజినెస్ ను ఇక్కడ సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మొత్తాన్ని రికవరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
మూడు వారాల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాను ఆపే సినిమా లేక పోవడంతో కచ్చితంగా సంచలనాలను సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. దాంతో మొదటి రోజే దాదాపు ఇరవై నాలుగు కోట్లు దాకా తెచ్చుకోవటంతో ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా నైజాంలో బ్రేక్ ఈవెన్ వస్తుంది లెక్కలు వేస్తున్నారు.