
ట్రిపుల్ ఆర్ గ్రాండ్ రిలీజ్ తో ప్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. చిన్నా పెద్దా.. అన్ని థియేటర్లలో సినిమా సందడి గట్టిగానే ఉంది. కొన్ని చోట్ల కొంత మంది ఓవర్ యాక్షన్ తో హల్ చల్ చేశారు. పిఠాపురంలో ఓ థియేటర్ దగ్గర గన్ తో ఓ యువకుడు టెన్షన్ పుట్టించాడు.
ట్రిపుల్ ఆర్ రిలీజ్ తో దేశమంతా థియేటర్ల దగ్గర పండగసందడి నెలకొంది. మన తెలుగు రాష్ట్రాలలో జాతర వాతావరణం కనిపించింది. కిక్కిరిసిన అభిమానులతో ట్రిపుల్ ఆర్ థియేటర్లు సందడిగా మారాయి. దాంతో పాటు కొన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగాయి. ఈక్రమంలోనే పిఠాపురంలో ఓ యువకుడు గన్ తో తెగ హల్ చల్ చేశాడు.
పిఠాపురంలోని అన్నపూర్ణ థియేటర్ లో ట్రిపుల్ ఆర్ సినిమా ప్లే అవుతుండగా ఫ్యాన్స హడావిడి చేశరు. అందులో ఓ యువకుడు గన్ పట్టుకుని స్క్రీన్ ముందు ఎగురుతూ కనిపించాడు. ఆతరువాత థియేటర్ బయటకు వచ్చికూడా గన్ తో ఫోజులు ఇస్తూ.. అటు ఇటూ తిరిగాడు. ఇది చూసి అక్కడ చుట్టుపక్కల జనాలు కంగారు పడ్డారు. ఫోలీసులకు ఇన్ ఫర్మేషన్ అందడంతో అక్కడికి వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అయితే పోలీసుల విచారణలో అది ఫేక్ గన్ అని తేలింది. ఢాంబికం చూపించడం కోసం అతను డమ్మీ గన్నుతో ఫోజులిచ్చిన్టు సమాచారం. ఇక ట్రిపుల్ ఆర్ సందడిలో చాలా చోట్ల ప్రమాదాలు జరిగాయి. అభిమానులు అత్యుత్సాహం వారి ప్రాణాల మీదకు తెచ్చింది. చిత్తూరులో ట్రిపుల్ ఆర్ బెన్ ఫిట్ షో చూడటానికి వస్తూ.. యువకులు ముగ్గురు యాక్సిడెంట్ లో చనిపోగా.. అనంతపురంలో ఓ అభిమాని ట్రిపుల్ ఆర్ చూస్తూ.. గుండెపోటుతో మరణించాడు. ఇలా అక్కడక్కడా ట్రిపుల్ ఆర్ హడావిడిలో అవాంఛనీయన సంఘటలను చోటు చేసుకున్నాయి.