సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ హెల్త్ అప్ డేట్

Surya Prakash   | Asianet News
Published : Oct 27, 2021, 09:29 AM IST
సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ హెల్త్ అప్ డేట్

సారాంశం

ఏకంగా 36 రోజులు హాస్పిటల్‌లో ఉన్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఈయన బైక్‌కు యాక్సిడెంట్ అయింది. రోడ్డుపై ఇసుక ఉండటంతో అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు సాయి ధరమ్ తేజ్. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలయ్యాడు సాయి.

నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్న సంగతి తెలిసిందే.  ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్‌ ను విడుదల చేస్తూండేవారు. ప్రస్తుతం  ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో పూర్తి విశ్రాంతి తీసుకుంటన్నారు. ఆయన్ని చూడటానికి వెళ్లిన వారు అప్ డేట్స్ ద్వారానే ఆయన పరిస్దితి తెలుస్తోంది.  ఆ మాటలు ఆయన ఆరోగ్యంపై అందోళన చెందుతున్న అభిమానులకు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. అయితే ఇంకా ఎంతకాలం రెస్ట్ తీసుకోవాలి...పూర్తిగా హెల్త్ సెట్ అయ్యిందా...పూర్తిగా కోలుకున్నట్లేనా? సాయి ధరమ్ ఫోటొలు బయటకు ఎందుకువదలటం లేదు వంటి డౌట్స్ అలాగే ఉండిపోయాయి. 

అంతెందుకు రీసెంట్ గా దర్శకుడు హరీష్ శంకర్ వెళ్లి చేతిలో చెయ్యి వేసిన చేతుల ఫొటో తప్ప మరోటి వదలలేదు. అప్పుడు కూడా అభిమానులు, చేతులు కాదు మొహం చూపించండి అంటూ కామెంట్లు చేసారు. ఈ నేపధ్యంలో మీడియా వర్గాల నుంచి అందుతున్న ఓ అప్ డేట్ మీకు ఇస్తున్నాం. సాయి ధరమ్ తేజ పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఎవరినీ పెద్దగా కలవకుండా రెస్ట్ తీసుకుంటున్నారు. అలాగే ఈ మెడిసన్స్, యాక్సిడెంట్ ట్రీట్మెంట్ క్రమంలో బరువు తగ్గారు. అలాగే మొహం మీద ఏ గాయాలు లేవు. కాకపోతే ఇంకా కొద్దిగా షాక్ ఉండటంతో మాట తడబడుతోంది. అదీ నాలుగైదు రోజుల్లో పూర్తిగా సెట్ అయ్యిపోతుంది. త్వరలోనే అఫీషియల్ గా జనాలకు కనపడనున్నారు.

Also read పెళ్లిపై తనదే ఫైనల్‌ డిసీషన్‌ అంటోన్న రీతూ వర్మ.. వెడ్డింగ్‌ ఎప్పుడో కూడా చెప్పేసిందిగా..

 ఇక సాయి తేజ్‌బైక్ యాక్సిడెంట్ విషయానికి వస్తే.. బైక్‌ రైడింగ్‌ అంటే ఆసక్తి. దీంతో ఎప్పటిలాగే.. శుక్రవారం రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌ నడుపుతూ ఒక్కసారిగా బైక్‌ అదుపు తప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన కుడికంటిపై భాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. అంతర్గతంగా గాయాలేవీ లేవని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఏకంగా 36 రోజులు హాస్పిటల్‌లో ఉన్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఈయన బైక్‌కు యాక్సిడెంట్ అయింది. రోడ్డుపై ఇసుక ఉండటంతో అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు సాయి ధరమ్ తేజ్. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలయ్యాడు సాయి.

Also read కెమెరాకు దగ్గరగా ఎద అందాలతో రెచ్చగొడుతున్న శ్రీముఖి.. ఈ హాట్ నెస్ తో కుర్రాళ్లకు కష్టమే

PREV
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు