పవర్ స్టార్, నితిన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ

Published : Nov 16, 2016, 07:01 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
పవర్ స్టార్, నితిన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ

సారాంశం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శీనివాస్,   ప్రముఖ పంపిణిదారుడు, నిర్మాత సుధాకర్ రెడ్డి కలిసి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ స్టార్ నితిన్ హీరోగా పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ , శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా  ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి.

ప్రముఖ లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకుడు. తొలిసారి పవన్ కల్యాణ్... తాను కాకుండా  తన బ్యానర్ పై మరో హీరో నితిన్  కోసం నిర్మాతగా మారటం విశేషం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలతో పాటు మూల కథను సమకూర్చటం మరో హైలెట్.

 

ఇంతటి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న  ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శ్రేష్ట్ మూవీస్ సంస్థ కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగాయి. దేవుని పటాలపై చిత్రీకరించిన  ముహూర్తపు షాట్ కు పవన్ కల్యాణ్ క్లాప్ నివ్వగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

 

హీరోయిన్ ,నటీనటులు, పూర్తి టెక్నికల్ టీమ్ మరియు షూటింగ్ సంబందిత వివరాలను త్వరలొనే తెలియచేస్తారు. ఈ చిత్రానికి మూల కథ: త్రివిక్రమ్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ : ఎన్. నటరాజ సుబ్రహ్మణ్యన్, ఆర్ట్: రామకృష్ణ, కథ,మాటలు-  స్ర్కీన్ ప్లే - దర్శకత్వం : కృష్ణ చైతన్య

PREV
click me!

Recommended Stories

ఒక ఫ్లాప్ తో, పవన్ కళ్యాణ్ పై ఆశతో ఈ ఏడాదికి ముగింపు పలుకుతున్న హీరోయిన్.. క్రేజీ ఫోటోస్ వైరల్
Hardik Pandya Girlfriend మహికా శర్మ ఒక్కనెల సంపాదన ఎంత.. ఆస్తులెన్నో తెలుసా?