
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను నవంబర్ 20న ముంబాయిలోని యశ్‌రాజ్ స్టూడియోలో సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నారు. ఇండియాలోనే ఫస్ట్ టైమ్ మోడ్రన్ టెక్నాలజీతో ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ ఫస్ట్‌లుక్ రిలీజ్ కార్యక్రమాన్ని లైకా ప్రొడక్షన్స్ యూ ట్యూబ్ ఛానల్ https://www.youtube.com/LycaProductionsలో లైవ్ స్ట్రీమ్ చేయబోతున్నారు.
ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్‌కుమార్, ఎమీ జాక్సన్, సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్, డైరెక్టర్ శంకర్, నిర్మాత సుభాష్‌కరణ్‌తోపాటు '2.0' చిత్రం యూనిట్ సభ్యులంతా పాల్గొంటారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న ఈ కార్యక్రమాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తారు.