రాజకీయాలపై కన్నేసిన మణిరత్నం

Published : Nov 16, 2016, 08:55 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
రాజకీయాలపై కన్నేసిన మణిరత్నం

సారాంశం

రాజకీయాల నేపథ్యంలో మణిరత్నం సినిమా టైటిల్ రిజిస్టర్ చేయించిన దర్శకుడు సంగీతం సమకూర్చనున్న ఏఆర్ రెహమాన్

దక్షిణాదిన ప్రఖ్యాత దర్శకుల్లో మణిరత్నం ఒకరు. చిన్న కథనైనా సరే..తన మేకింగ్ ద్వారా అద్భుతంగా తెరకెక్కించడంలో ఆయన తర్వాతే ఎవరైనా.. అందుకే ఆయన చిత్రాలకు ప్రేక్షకులు ఇప్పటికీ నీరాజనం పలుకుతుంటారు. ప్రస్తుతం కార్తితో క్యూట్ లవ్ స్టోరీ చేస్తున్నాడు లెజెండరీ దర్శకుడు. మార్చిలో ఈ చిత్రం విడుదల కానుంది. డ్యూయెట్ పేరుతో తెలుగులోకి అనువాదం కానుంది. దిల్ రాజు తెలుగు వర్షన్ ను ప్రసెంట్ చేస్తున్నాడు.  

డ్యూయెట్ సినిమా తర్వాత మణిరత్నం ఓ భారీ చిత్రం తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఓకే బంగారం, డ్యూయెట్ లాంటి ప్రేమకథా చిత్రాల తర్వాత మణిరత్నం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో చిత్రాన్ని తీసుకురానున్నాడట. ఎధిర్ కట్చీ పేరుతో తెరకెక్కే ఈ చిత్రంలో ఒకప్పటి హీరో కార్తిక్ ప్రధాన పాత్రలో నటించనున్నాడట. ఎధిర్ కట్జీ అంటే అపోజీషన్ అని అర్ధం. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను మణిరత్నం తమిళనాడు ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేయించాడు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. రెహమాన్ స్వరాలు సమకూర్చనున్నాడు.

PREV
click me!

Recommended Stories

Allu Arjun Top 10 Movies: అల్లు అర్జున్‌ బెస్ట్ టాప్‌ 10 మూవీస్‌, లిస్ట్ లోనే లేని పుష్ప 2.. ఇదేం విచిత్రం
Karthika Deepam 2 Today Episode:సంతోషంలో దీప, కార్తీక్-దీప కిందపడేలా నూనె పోసిన జ్యో-దీప జారిపడిందా?