మహేష్ సరసన నేను శైలజ ఫేం కీర్తి

Published : Nov 16, 2016, 09:35 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
మహేష్ సరసన నేను శైలజ ఫేం కీర్తి

సారాంశం

నేనుశైలజా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది కీర్తి సురేష్. ప్రస్తుతం కోలీవుడ్ లో లీడింగ్ లేడీగా దూసుకుపోతోంది.రీసెంట్ గా రెమో తో బ్లాక్ బస్టర్ ను అందుకుంది. త్వరలో ఈ చిత్రం తెలుగులో కూడావిడుజలకు రెడీ అవుతోంది. సూర్య తో కొత్త సినిమా చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరో వైపు తెలుగులో నాని సరసన నేను లోకల్ చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది.కీర్తి సురేష్ కోసం ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా పోటీ కనిపిస్తోంది. పవర్ స్టార్, సూపర్ స్టార్ లు కీర్తి కోసం పోటీ పడుతుంటే.. కీర్తి సూపర్ స్టార్ కు ఓకే చెప్పిందట. మరి పవర్ స్టార్ ఆఫర్ ఏం చేస్తుందో...

శ్రీమంతుడు సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, హిట్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభమయింది. మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ వ్యవహారాలు పూర్తి కాగానే.. ఫిబ్రవరి నుంచి కొరటాల దర్శకత్వంలో రూపొందనున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు.

ప్రస్తుతం కొరటాల-మహేష్ ల సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు, నటీనటుల సెలెక్షన్స్ జరుగుతున్నాయి. ఈ మూవీలో మహేష్ సరసన హీరోయిన్ గా నేను శైలజ ఫేం కీర్తి సురేష్ ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాల్లో బిజీ హీరోయిన్ అయిన కీర్తి, సూపర్ స్టార్ పక్కన ఛాన్స్ అనగానే టక్కున ఒప్పేసుకుందట. ప్రస్థుతం నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ నటించిన నేను లోకల్ మమూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

మరోవైపు  త్రివిక్రమ్ , పవన్ కొత్త సినిమాలో కీర్తీనే సెలక్ట్ చేయాలని చూస్తున్నారు. జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ అని ప్రచారం సాగుతోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో ఖుష్బూ కీలక పాత్రలో నటిస్తోంది.  మరి మహేష్ తో ఒప్పుకున్న కీర్తి పవర్ స్టార్ సరసన వచ్చిన ఆఫర్ ఏం చేస్తుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Ram Charan Peddi Movie: మైండ్ బ్లాక్ అయ్యే సన్నివేశాలతో 'పెద్ది' ఢిల్లీ షెడ్యూల్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
ఆ కారణంతోనే జబర్దస్త్‌లో చమ్మక్ చంద్ర కనిపించట్లేదు: కమెడియన్ వెంకీ