దుబయిలో రోబో 2.0 ఆడియో వేడుక

Published : Sep 07, 2017, 02:27 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
దుబయిలో రోబో 2.0 ఆడియో వేడుక

సారాంశం

అక్టోబర్ లో రోబో 2.0 ఆడియో వేడుక వేదిక దుబయ్ నవంబర్ లో హైదరాబాద్ లో టీజర్ డిసెంబర్ లో చెన్నైలో ట్రైలర్ లాంచ్ అఫీషియల్ గా డిక్లేర్ చేసిన లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్  

సూపర్ స్టార్ రజినీ కాంత్,, శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న రోబో సీక్వెల్ మూవీ 2.0 రిలీజ్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ పై దృష్టిపెట్టింది. ఇప్పటికే వాల్ డ్ టూర్ లో బిజీగా గడుపుతోన్న 2.0టీమ్ ప్రమోషన్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే నెల నుంచి మరింత వేగంగా ప్రమోషనల్ యాక్టివిటీస్ వుండేలా ప్లాన్ చేశారు.

 

రోబో ఆడియో వేడుక దుబాయిలో ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అంతేకాదు.. దీపావళి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుండటం విశేషం. ఇప్పటికే దుబయిలో నిర్వహించ తలపెట్టిన ఆడియో ఈవెంట్ కు దేశవ్యాప్తంగా వున్న వివిధ సినీ పరిశ్రమల నుంచి సూపర్ స్టార్స్ ను ఆహ్వానించి చాలా గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం.

 

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎమీ జాక్సన్ హిరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ క్రేజీ హీరో అక్షయ్ కుమార్ మరో కీలకపాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు దేశవ్యాప్తంగా రికార్డులు కొల్లగొట్టిన బాహుబలి2 చిత్రం సాధించిన కలెక్షన్స్స రికార్డును బద్దలు కొట్టే సత్తా ఒక్క రోబో 2.0కు మాత్రమే వుందని ఇండస్ట్రీ పండితులు అంచనా వేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‌కు 'నువ్వు నేను' సినిమాలో ఛాన్స్.. కుండబద్దలు కొట్టిన తేజ
నాలుగో క్లాస్‌లో ఫ్రాక్ వేసి అమ్మాయిలా యాక్ట్ చేయమన్నారు: నవీన్ పోలిశెట్టి