ఆశ్చర్యం.. అద్బుతం.. విజువల్ మిరాకిల్: 2.0 టీజర్‌ రిలీజ్ చేసిన శంకర్

By sivanagaprasad KodatiFirst Published Sep 13, 2018, 10:15 AM IST
Highlights

సూపర్‌స్టార్ రజనీకాంత్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతూ.. భారతీయ సినీ పరిశ్రమ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోబో 2.0 టీజర్‌‌ను వినాయక చవితి కానుకగా రిలీజ్ చేశాడు శంకర్.

సూపర్‌స్టార్ రజనీకాంత్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతూ.. భారతీయ సినీ పరిశ్రమ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోబో 2.0 టీజర్‌‌ను వినాయక చవితి కానుకగా రిలీజ్ చేశాడు శంకర్. మరోసారి చిట్టిగా.. వసీకర్‌గా రజనీ ఆకట్టుకున్నాడు.

విజువల్ వండర్‌గా.. భారతీయ సినీ చరిత్రలో ఇంతవరకు చూడని వీఎఫ్ఎక్స్‌ మాయాజాలాన్ని ఈ సినిమాలో చూస్తారని చెప్పినట్లుగానే శంకర్ అన్న మాట నిలబెట్టుకున్నాడు. సైన్స్ ఫిక్షన్ వరల్డ్ అంటే ఎలా ఉంటుందో నిమిషంలో చూపించాడు. హాలీవుడ్ సినిమాకు ఏ మాత్రం తీసుపోని రీతితో అద్భుతాన్ని ఆవిష్కరించాడు శంకర్.

మాట్లాడుతున్న వారి చేతులోంచి ఫోన్లన్నీ మాయమైపోతున్న షాట్‌తో టీజర్ మొదలవుతుంది.. నిద్రిస్తున్న ఓ వ్యక్తి ఉన్నట్లుండి లేచి చూడగా... కోట్లాది ఫోన్లు తన చుట్టూ ఉండటం చూసి ఉలిక్కిపడతాడు.. ఆ ఫోన్ల పై నుంచి భయపెట్టే ముఖంతో అక్షయ్ కుమార్ ఎంట్రీ ఇస్తాడు. విలన్‌ను అంతమొందించేందుకు మరోసారి చిట్టిని ప్రవేశపెట్టాలని అధికారులకు రజనీ సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత చిట్టి విన్యాసాలు, విలన్‌తో పోరాటం చూడాలంటే సినిమా విదుడలయ్యే వరకు ఆగాల్సిందే.

విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా.. అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. నవంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

click me!