భర్తగా, దర్శకుడిగా కృష్ణవంశీ.. రమ్యకృష్ణకి ఎవరంటే ఇష్టమో తెలుసా?.. శివగామి క్రేజీ ఆన్సర్‌..

Google News Follow Us

సారాంశం

దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన `రంగమార్తాండ` చిత్రంలో ఆయన భార్య నటి రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పోషించిన విసయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణవంశీపై రమ్యకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. 
 

క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ రూపొందించిన మూవీ `రంగమార్తాండ` థియేటర్లో విడుదలై ఆకట్టుకుంటుంది. విమర్శల ప్రశంసలందుకుంది. కమర్షియల్‌గా స్లోగా ఉన్నా, ఆడియెన్స్ నుంచి మంచి అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. బ్రహ్మానందం, ప్రకాష్‌ రాజ్‌, రమ్యకృష్ణ, శివాత్మిక నటనలకు ప్రశంసలు దక్కుతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత కృష్ణవంశీ సినిమాలో రమ్యకృష్ణ నటించిన విషయం తెలిసిందే. `చంద్రలేఖ` చిత్రంలో నటించింది రమ్యకృష్ణ ఆ సమయంలోనే ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. 

ఇక దాదాపు 25ఏళ్ల తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్‌లో పూర్తి స్థాయి రోల్‌ చేసింది రమ్యకృష్ణ. మధ్యలో `శ్రీ ఆంజనేయం`లో గెస్ట్ రోల్‌ చేసిన విషయం తెలిసిందే. `రంగమార్తాండ` చిత్రంలో రంగమార్తాండ(ప్రకాష్‌రాజ్‌) భార్యగా శ్రీమతి రాజుగారు పాత్రలో నటించింది. కళ్లతోనే నటించి వాహ్‌ అనిపించింది. కన్నీళ్లు పెట్టించింది. ఇలాంటి పాత్ర రమ్యకృష్ణ ఎప్పుడూ పోషించలేదు. ఆమె పాత్రకి సైతం ప్రశంసలు దక్కుతున్న నేపథ్యంలో తాజాగా రమ్యకృష్ణ ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో ముచ్చటించింది. ఇందులో కృష్ణవంశీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్‌ చేసింది. 

తాను హీరోయిన్‌గా మొదట గ్లామర్‌ రోల్స్ చేస్తూ వచ్చానని, నటిగా క్రమ క్రమంగా ఎవాల్వ్ అవుతూ వచ్చానని తెలిపింది. అనుభవంలో నుంచి నటిగా పరిణతి సాధించానని తెలిపింది. ఈ సందర్భంగా తన భర్త, దర్శకుడు కృష్ణవంశీపై ప్రశంసలు కురిపించింది రమ్యకృష్ణ. ఆయన్ని ఆకాశానికి ఎత్తేసింది. కృష్ణవంశీ డైరెక్షన్‌లో పనిచేయడం అద్భుతమైన ఎక్స్ పీరియెన్స్ అని, ఒక నటిగా ఆయన దర్శకత్వంలో పనిచేయడాన్ని తాను ఎంజాయ్‌ చేశానని, ఆయనతో పనిచేయడాన్ని ఇష్టపడతానని తెలిపింది. 

ఒక యాక్టర్‌ నుంచి ఎలాంటి నటన రాబట్టుకోవాలో ఆయనకు బాగా తెలుసు అని, అంతేకాదు డైలాగ్ డెలవరీగానీ, పాత్ర ఎలా ప్రవర్తించాలనేది గానీ, ఆయన చాలా డిటెయిల్డ్ గా ఎక్స్ ప్లెయిన్‌ చేస్తారని, ఆయన వివరించిన తీరుతో నటుడికి యాక్ట్ చేయడం చాలా ఈజీ అయిపోతుందని, దర్శకుడిగా తనే ఈజీ చేస్తాడని తెలిపింది రమ్యకృష్ణ. ఇప్పటి వరకు తాను పనిచేసిన దర్శకులందరితో పోల్చితే వంశీతో వర్క్ చేయడం బెస్ట్ ఎక్స్ పీరియెన్స్ అని ప్రశంసించింది.  

అంతేకాదు దర్శకుడిగా, భర్తగా ఇద్దరిలో ఎవరంటే మీకు బాగా ఇష్టం అనే అంశంపై ఆమె స్పందిస్తూ, ఆయన డైరెక్షన్‌ గురించి ప్రశంసిస్తూ, భర్తగా కంటే తనకు వంశీ డైరెక్టర్‌గానే ఇష్టమని చెప్పి షాకిచ్చింది. ఆయనకు భార్యగా కంటే ఆయన దర్శకత్వంలో పనిచేయడానికే ఎక్కువ ఇష్టపడతానని తెలిపింది. అయితే గతంలో కృష్ణవంశీ కూడా భర్తగా తనని రమ్య భరిస్తుందని నిర్మొహమాటంగా చెప్పారు. ఈ విషయాన్ని యాంకర్ గుర్తు చేయగా, అందుకు రమ్యకృష్ణ అవును అని చెబుతూ ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. ప్రస్తుతం రమ్యకృష్ణ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

1998లో వచ్చిన `చంద్రలేఖ` సినిమా సమయంలో రమ్యకృష్ణ, కృష్ణవంశీ మధ్య ప్రేమ చిగురించింది. అది పెళ్లి వరకు వెళ్లింది. 2003లో ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. కృష్ణవంశీకి ఇటీవల సరైన విజయాలు లేవు. `మహాత్మ` తర్వాత వరుసగా పరాజయం చెందాయి. తాజాగా `రంగమార్తాండ`తో దర్శకుడిగా మెప్పించారు. ఇది కమర్షియల్‌గా ఏ స్థాయిలో ఆదరణ పొందుతుందో చూడాలి. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on