కపూర్‌ ఫ్యామిలీలో మరో విషాదం.. రాజీవ్‌ కపూర్‌ కన్నుమూత

By Aithagoni RajuFirst Published Feb 9, 2021, 2:50 PM IST
Highlights

రిషి కపూర్‌, రణ్‌ధీర్‌ కపూర్‌ల సోదరుడు, లెజెండరీ నటుడు రాజ్‌కపూర్‌ కుమారుడు రాజీవ్‌ కపూర్‌(58) కన్నుమూశారు. గుండెపోటుకి గురై మంగళవారం ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని రాజీవ్‌ కపూర్‌ వదిన, రిషి కపూర్‌ భార్య నీతూ కపూర్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.

రిషి కపూర్‌, రణ్‌ధీర్‌ కపూర్‌ల సోదరుడు, లెజెండరీ నటుడు రాజ్‌కపూర్‌ కుమారుడు రాజీవ్‌ కపూర్‌(58) కన్నుమూశారు. గుండెపోటుకి గురై మంగళవారం ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని రాజీవ్‌ కపూర్‌ వదిన, రిషి కపూర్‌ భార్య నీతూ కపూర్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.

 గతేడాది ఏప్రిల్‌లో క్యాన్సర్‌ కారణంగా రిషికపూర్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే. అంతకు ముందు గతేడాది జనవరిలో రాజీవ్‌ కపూర్‌ సోదరి రీతూ నందా కన్నుమూశారు. ఏడాది గడవకముందే వారింట్లో మరో విషాదం నెలకొనడం విచారకరం. ప్రస్తుతం స్టార్‌ హీరోగా రాణిస్తున్న రణ్‌బీర్‌ కపూర్‌కి రాజీవ్‌ కపూర్‌ బాబాయ్‌ అవుతారు. రాజీవ్‌ కపూర్‌ మరణంతో దీంతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా కపూర్‌ ఫ్యామిలీ దుఖ సాగరంలో నిండిపోయింది. రాజీవ్‌ కపూర్‌కి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 

రాజ్‌ కపూర్‌ వారసత్వంగా, 1983లో `ఏక్‌ జాన్‌ హై హమ్‌` చిత్రంతో నటుడిగా బాలీవుడ్‌ తెరకి పరిచయం అయ్యారు రాజీవ్‌ కపూర్‌. ఆ తర్వాత `ఆస్మాన్‌`, `లవర్‌ బాయ్‌`, `జబర్దస్త్`, `రామ్‌ తేరి గంగా మల్లి`, `అంగారే`, `జల్‌జలా`, `హమ్‌ తు చలే పర్దేశ్‌`, `నాగ్‌ నాగిన్‌`, `జిమ్మేదార్‌` చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే రిషీ కపూర్‌ స్థాయిలో హీరోగా రాణించలేకపోయారు రాజీవ్‌ కపూర్. 

ఆయననటుడిగానే కాదు దర్శకుడిగా, నిర్మాతగానూ రాణించారు. `ప్రేమ్‌గ్రాంత్‌` అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. దీంతో దర్శకత్వం వైపు చూడలేదు. అంతకు ముందు `ప్రేమ్‌ రోగ్‌`, `బివి ఓ బివి` చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. నిర్మాతగా `ఆ అబ్‌ లాట్‌ చలేన్‌`, `ప్రేమ గ్రాంత్‌`, `ఏక్‌ జాన్‌ హై హమ్‌` సినిమాలను నిర్మించారు. నిర్మాతగా ఫర్వాలేదనిపించుకున్నారు. ఎడిటర్‌గా `ఆ అబ్‌ లాల్‌ చలేల్‌, `ప్రేమ్‌గ్రాంత్‌` చిత్రాలకు పనిచేశారు. ఇలా మల్టీ టాలెంటెగా రాణించారు.

click me!