సప్తగిరికు ఇది అల్లు అరవింద్ ఇచ్చే గిప్ట్ !

By Surya Prakash  |  First Published Feb 9, 2021, 12:20 PM IST


కొంతమంది నటులు కెరీర్ బాగా వున్న సమయంలో తమదికాని పాత్రల వైపు వెళ్ళి చేజేతులా కెరీర్ పాడుచేసుకొంటూండటం గమనిస్తూనే ఉంటాం. అప్పట్లో రాజబాబు, చలం, పద్మనాభం లాంటి మంచి హాస్టనటులు... హీరోలుగా సినిమాలు చేసి చేతులు కాల్చుకొన్నారు. ఈ మధ్య బ్రహ్మానం దం, అలీ, బాబూమోహన్ హీరోలుగా మారా రు. కాని వాస్తవం తెలుసుకొని కమిడియన్స్ గా చక్కటి లైఫ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సునీల్, ధన్‌రాజ్, సప్తగిరి లాంటి వారు... హీరోలయ్యా రు. సునీల్ హీరోకి తక్కువ, కమెడియన్‌కు ఎక్కువగా మిగిలిపోయాడు. ఇక ధన్‌రాజ్ కష్టపడి ఎదిగి మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకొన్నాడు. రెండు, మూడు సినిమాలు తీసి కష్టాలను కొని తెచ్చుకొన్నాడు.
 


 కమిడయన్  సప్తగిరి విషయానికి వస్తే హాస్యనటుడిగా వెండితెరకు పరిచయమైన సప్తగిరిది విభిన్నమైన కామెడీ టైమింగ్‌. అలా కమెడియన్‌గా రాణిస్తూనే 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌'తో హీరోగా మారాడు. తొలి ప్రయత్నం బాగుందనిపించింది. ఆ తర్వాత చేసిన 'సప్తగిరి ఎల్‌ఎల్‌బీ' కూడా కష్టమనిపించింది.  ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని సప్తగిరి చేసిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం 'వజ్ర కవచధర గోవింద'. ఆ సినిమా కూడా వర్కవుట్ కాలేదు. కమిడియన్ గానూ ఖాళీ పడ్డారు. ఇలాగే వెళితే పరిశ్రమలో స్థానం శూన్యమైపోతోంది... గ్రహించినట్లు ఉన్నాడు ఇప్పుడు సప్తగిరి డిజిటల్ మీడియా వైపు అడుగెలేస్తున్నాడు.

 ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ప్రారంభం కానున్న ఓ వెబ్ సిరీస్ చేయటానికి కమిటయ్యాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ యువ చిత్ర నిర్మాతలతోపాటు డైరెక్టర్స్ కూడా ఆహా కోసం ఒరిజినల్ షోలు మరియు చిన్న చిత్రాలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా  డైరెక్టర్ కరుణ కుమార్ కూడా ఓ వెబ్ సిరీస్ రూపొందించే ప్లాన్ లో ఉన్నారు.  ఈ వెబ్ సిరీస్ లో సప్తగిరి మెయిన్ లీడ్ గా నటిస్తోనట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ స్వయంగా సప్తగిరితో మాట్లాడి ఒప్పించినట్లు తెలుస్తోంది. తన కెరీర్ కు ఇదో టర్నింగ్ పాయింట్ లా మారుతుందని సప్తగిరి భావిస్తున్నారట.

Latest Videos

 తన ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ కోసం అల్లు అరవింద్ యువ చిత్రనిర్మాతలతో పాటు డైరెక్టర్స్ తో సహా ‘ఆహా’ కోసం ఒరిజినల్ షోలు మరియు చిన్న చిత్రాలను నిర్మించే ప్లాన్ లో ఉన్నారు.  ఇప్పటికే ఆహా వేదికలో సమంత అక్కినేని సామ్ జామ్ అనే షో ప్రారంభించి.. సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు చేశారు. ఆహాలో షోలు, సినిమాలతోపాటు, వెబ్ సిరీస్‏లను ఎక్కువగా చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
 

click me!