
దాదాపు రెండు నెలలుగా ఎక్కడ విన్నా 'కాంతార' కబుర్లే. కన్నడంలో రూపొందిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడమే. భారీ స్థాయిలో కలెక్షన్లను కొల్లగొడుతూ బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తోంది. అలాగే తెలుగులో ఎవరూ ఊహించని విధంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. దీంతో పది రెట్ల లాభాలను సొంతం చేసుకుని హవాను చూపించింది. ఈ నేపథ్యంలో 'కాంతార' హీరో, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి బాగా పాపులర్ అయ్యారు. దాంతో ఆయన్ని అన్ని మీడియా ఛానెల్స్ ఇంటర్వూ చేస్తున్నాయి. ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వివాదాస్పద మవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారు..
“నేను ఓ కన్నడ వాడినని గర్వపడతాను. హిందీ సినిమాలకు పని చేయను. నేను ఇక్కడ ఇలా ఈ స్దాయిలో ఉన్నానంటే అందుకు కారణం కన్నడ పరిశ్రమ, కన్నడ ప్రజలు. ఓ సినిమా హిట్ అయ్యిందని నా కుటుంబాన్ని, స్నేహితులను మార్చలేను. నా మూలాలు కన్నడ సినిమాలోనే ఉన్నాయి” అంటూ రిషిబ్ ఓ ఇంటర్వూ లో చెప్పారు. కాంతారా హిందీలో బాగా ఆడింది కదా.. మీరు హిందీలో సినిమా డైరక్ట్ చేస్తారా అన్నందుకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. అయితే ఇది నార్త్ ఇండియన్ జనాలకు కోపం తెప్పించింది. సోషల్ మీడియాలో ఓ రేంజిలో కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే 'కాంతార' చూడద్దంటూ కామెంట్స్ మొదలెట్టేసారు. ఇంకా నయ్యిం..రిలీజ్ కు ముందైతే బాయ్ కాట్ 'కాంతార' అనేలా ఉన్నారు.
“ఒక పెద్ద హిట్ రాగానే తన యాటిట్యూట్ చూపెడుతున్నాడు. అతను అంతలా కన్నడ సినిమాని ప్రేమిస్తే ..అక్కడే ఉండదలిస్తే ...ఎందుకు హిందీలో తన సినిమాని డబ్ చేసి రిలీజ్ చేసారు.. ? అతనికి మన డబ్బు కావాలి కానీ మన ఇండస్ట్రీని గౌరవించడు” అని కామెంట్స్ మొదలెట్టారు. అతను కాంతారా రిలీజ్ కు ముందే ఈ మాట చెప్పి ఉండాల్సింది. అన్ని భాషల వాళ్లూ కలిసి చూస్తేనే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇలాంటి గర్వంగా మాట్లాడే మాటలని జనం వదిలేస్తారు. ఇంకొద్ది రోజులు తర్వాత అతను ఎవరో కూడా గుర్తు ఉండరు మరొకరు కామెంట్ చేసారు. అలా ఉత్తి పుణ్యానికి తన మనస్సులో అభిప్రాయం చెప్పినందుకు రిషబ్ షెట్టి..సోషల్ మీడియా జనం కామెంట్స్ కు బలి అవుతున్నాడు.
ఇక రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ డివోషనల్ హిట్ చిత్రం “కాంతారా”. కన్నడ సహా తెలుగు మరియు హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ అయ్యి అదిరే వసూళ్లతో ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతూ భారీ లాభాలు అందించి పెడుతోంది. తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క కర్ణాటక లోనే ఈ చిత్రం ఏకంగా ఒక కోటికి పైగా టికెట్లు అమ్ముడుపోయినట్టుగా సమాచారం. దీనితో 1 కోటి టికెట్స్ అమ్ముడు పోయిన చిత్రంగా కాంతారా ఇప్పుడు అక్కడ భారీ రికార్డు నెలకొల్పింది. ఈ సూపర్ హిట్ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. అలాగే హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.