
సోషల్ మీడియాలో అనసూయ సూపర్ యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేస్తున్నారు. తాజాగా భరద్వాజ్ తో దిగిన ఫోటో ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. భర్త భుజంపై తలవాల్చి ఒక రొమాంటిక్ ఫోజ్ ఇచ్చారు. భర్తపై అనసూయకు ఉన్న ప్రేమను ఈ ఫోటో తెలియజేస్తుంది. అనసూయ-భరద్వాజ్ లది ప్రేమ వివాహం. పేరెంట్స్ తో ఫైట్ చేసి అనసూయ భరద్వాజ్ ని వివాహం చేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఒక ఎన్సీసీ క్యాంపులో అనసూయ-భరద్వాజ్ లకు పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసింది. అనసూయ పేరెంట్స్ భరద్వాజ్ తో పెళ్ళికి ఒప్పుకోలేదు. కన్నవారిని ఎదిరించి కొన్నేళ్ల పాటు హాస్టల్ లో ఉంది అనసూయ. చివరకు పేరెంట్స్ మనసు కరిగి పెళ్లికి ఒప్పుకున్నాక మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అనసూయకు ఇద్దరు అబ్బాయిలు. ఇటీవల చిన్న కొడుకు బర్త్ డే జరిపి, ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
మరోవైపు అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు దూరమయ్యారు. జబర్దస్త్ మానేసిన అనసూయ ఇతర టెలివిజన్ షోస్ లో కూడా కనిపించడం లేదు. ఇది ఆమె అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. నటిగా బిజీ కావడంతో యాంకరింగ్ పై దృష్టి తగ్గించింది. సినిమాలు, వెబ్ సిరీస్లతో అనసూయ కెరీర్ ఫుల్ జోష్ లో వెళుతుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తున్నారు.
ఈ మధ్య అనసూయపై విపరీతమైన నెగిటివిటీ పెరిగింది. లైగర్ మూవీని ఉద్దేశిస్తూ ఆమె వివాదాస్పద ట్వీట్ వేశారు. అది విజయ్ దేవరకొండ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఆంటీ అంటూ ఆమెను ట్రోల్ చేశారు. అనసూయ ప్రతి సోషల్ మీడియా పోస్ట్ ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ కి గురవుతుంది. ట్రోల్ చేస్తున్న కొద్దీ అనసూయ మరింత ఎక్కువ చేస్తున్నారు. అప్పుడప్పుడు వాళ్ళను రెచ్చగొడుతున్నారు.