
ప్రత్యేకించి బెంగాల్ లో పలువురు సినీ ప్రముఖులు కమలం పార్టీ లో చేరారు. రిమికి గ్లామరస్ గుర్తింపు ఉంది కాబట్టి బీజేపీ ఏదైనా పదవి ఇస్తుందేమో చూడాల్సి ఉంది.ప్రియదర్శన్ తీసిన ‘హంగామా’ సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది రిమి. ఆ తర్వాత పలు గ్లామరస్ పాత్రలను పోషించింది. అలాగని నటనలో ఏమీ తీసిపోలేదు.
ప్రత్యేకించి తెలుగు సినిమా ‘అందరివాడు’ హిట్ కాలేదు కానీ, అందులో నటనలో చిరుతో పోటీ పడింది ఈ భామ. హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయిన ఈ బ్యూటీ ఆ మధ్య బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత పెద్దగా మీడియా ముందు కనిపించలేదు. ఇప్పుడు రాజకీయాల వైపు వచ్చింది.