దేవుడా, అంబానీ ఇంట పెళ్లి అంతే అంతే మరి.. హాలీవుడ్ సింగర్ కి ఎన్ని కోట్లు ఇస్తున్నారో తెలుసా

Published : Mar 02, 2024, 01:26 PM ISTUpdated : Mar 02, 2024, 01:27 PM IST
దేవుడా, అంబానీ ఇంట పెళ్లి అంతే అంతే మరి.. హాలీవుడ్ సింగర్ కి ఎన్ని కోట్లు ఇస్తున్నారో తెలుసా

సారాంశం

ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక కనీవినీ ఎరుగని విధంగా సాగుతోంది. తన కొడుకు పెళ్లి కోసం ముఖేష్ అంబానీ ఏకంగా 1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 1000 మందికి గెస్ట్ లకు ఆహ్వానం అందింది.

ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక కనీవినీ ఎరుగని విధంగా సాగుతోంది. తన కొడుకు పెళ్లి కోసం ముఖేష్ అంబానీ ఏకంగా 1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 1000 మందికి గెస్ట్ లకు ఆహ్వానం అందింది. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుక దృశ్యాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

టాలీవుడ్ నుంచి రాంచరణ్, ఉపాసన దంపతులు అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. తన కొడుకు పెళ్లివేడుక చిరకాలం గుర్తుండిపోయేలా, ప్రపంచం మొత్తం చెప్పుకునేలా ముఖేష్ అంబానీ సెలెబ్రేషన్స్ చేస్తున్నారు. అనంత్ అంబానీ పెళ్లి వేడుక  కోసం హాలీవుడ్ టాప్ పాప్ సింగర్ రిహన్నాని పిలిపించారు. 

రిహన్నా ఎంత కాస్ట్లీ సింగల్ సింగర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ పెర్ఫామెన్స్ కోసం రిహన్నాని పిలిపించారు. అనంత్ అంబానీ వెడ్డింగ్ పెర్ఫామెన్స్ కోసం ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. 

ఆమెకి ఏకంగా 50 కోట్లు ఇస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఇండియాలో కొందరు స్టార్ హీరోలు ఒక చిత్రం కోసం ఏడాది మొత్తం కష్టపడితే అంత రెమ్యునరేషన్ దక్కుతుంది. కానీ ఈమె మాత్రం ఒక్క స్టేజి పెర్ఫామెన్స్ ఇచ్చినందుకు అంత మొత్తం సమర్పించు కుంటున్నారు అని అంటున్నారు. 

ఆమె గ్రీన్ కలర్ అవుట్ ఫిట్ లో పెర్ఫామెన్స్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు అనేదానికి ఇదే ఉదాహరణ అని మరికొందరు అంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..