సినిమాలు నా డ్రీమ్స్ లో లేనే లేవు- రిచా గంగోపాధ్యాయ

Published : Oct 24, 2017, 12:21 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
సినిమాలు నా డ్రీమ్స్ లో లేనే లేవు- రిచా గంగోపాధ్యాయ

సారాంశం

తన గ్లామర్ తో తెలుగులో ఫాలోయింగ్ సంపాదించుకున్న రిచా గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వున్న గ్లామర్ డాల్ తాజాగా సినిమాలు తన డ్రీమ్స్ లో లేవంటూ గుడ్ బై చెప్పేసిన రిచా  

దర్శకుడు శేఖర్ కమ్ముల, రానా కాంబినేషన్ లో తెరకెక్కిన 'లీడర్‌'తో టాలీవుడ్‌కు పరిచయమై.. ప్రభాస్‌తో మిర్చి, రవితేజతో సారొచ్చారు, మిరపకాయ్ లాంటి హిట్ సినిమాల్లో నటించిన రిచా.. వెంకటేశ్‌తో నాగవల్లి మూవీలో నటించింది. బొద్దుగా, నిండుగా, పుష్టిగా కనిపించే రిచా.. గత కొంత కాలంగా సినిమాలకకు దూరంగా వుంటోంది.

 

నాగార్జునతో భాయ్ చిత్రంలో నటించిన రిచా గంగోపాధ్యాయ్ న అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది..ఇదే ఆమె చివరి సినిమా.  గత నాలుగేళ్లుగా సినీ ఇండస్ట్రీకి రిచా దూరంగా ఉంటోంది. నటనకు గుడ్ బై చెప్పానని తనమీద ఇక ఆశలు పెట్టుకోవద్దంటూ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది రిచా.  ఆ మద్య తాను ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పినట్లు స్వయంగా ప్రకటించింది.

 

దాంతో ఆమె ఫ్యాన్స్, ఫాలోవర్స్ మీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి పదే పదే ట్విట్టర్ అడగడంతో..వారికి సమాధానం ఇచ్చింది.  . 'నా తర్వాతి ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నారు. కానీ అందరికీ నేనొక విషయం చెప్పాలనుకుంటున్నా. నా చివరి మూవీ విడుదలై దాదాపు ఐదేళ్లు కావొస్తుంది. నా వివరాలు గూగుల్‌లో చూస్తే తెలుస్తుంది.సినిమాలకు గుడ్ బై చెప్పేశానని నటి రిచా గంగోపాధ్యాయ్ వరుస ట్వీట్లు చేసింది.

 

మరోవైపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ల హవా నడుస్తుంది. ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు దాటిన త్రిష, నయన్, కాజల్, సమంత జోరు తగ్గగా..రకుల్, రాశీఖన్నా,రెజీనా లతో పాటు ఈ మధ్య కీర్తి సురేష్, లావణ్య త్రిపాఠి, మెహ్రీన్, సాయి పల్లవి లాంటి వాళ్లు జోరు పెంచారు. ఇప్పుడున్న యంగ్ హీరోలకు వీరు సరైన జోడీగా ఉండటతంతో వీళ్లకి ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది. అయితే ఇప్పటికీ హిరోయిన్లకు మాంచి డిమాండ్ వున్నా,  గ్లామర్ తో అభిమానులను సంపాదించుకున్న రిచా గంగోపాధ్యాయ ఇలా సినిమాలకు దూరమవుతున్నట్లు ప్రకటించడాన్ని అబిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌