సుశాంత్ ని గుర్తు చేసుకుంటూ వీడియో పోస్ట్ చేసిన రియా చక్రవర్తి

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 22, 2022, 08:10 AM IST
సుశాంత్ ని గుర్తు చేసుకుంటూ వీడియో పోస్ట్ చేసిన రియా చక్రవర్తి

సారాంశం

బాలీవుడ్ లో నటుడిగా దూసుకుపోతున్న టైం లో యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుట్ జీవితం చిన్నాభిన్నమైన వైనం అందరం చూశాం. సుశాంత్ మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ లో నటుడిగా దూసుకుపోతున్న టైం లో యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుట్ జీవితం చిన్నాభిన్నమైన వైనం అందరం చూశాం. సుశాంత్ మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

శుక్రవారం సుశాంత్ 36వ జయంతి. ఈ సంద్భంగా అభిమానులంతా సుశాంత్ ని సోషల్ మీడియాలో గుర్తు చేసుకున్నారు.సుశాంత్ సూసైడ్ చేసుకున్నప్పటికీ అతడి మరణం ఇప్పటికీ మిస్టరీ నే.

సుశాంత్ సూసైడ్ వెనుక ప్రేమ వ్యవహారాలు ఉన్నాయనే కోణంలో ఇప్పటికీ విచారణ జరుగుతూనే ఉంది.అతడి మరణం విషయంలో నటి రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

రియా చక్రవర్తి, సుశాంత్  సింగ్ రాజ్ పుత్ చాలా  కాలం ప్రేమలో ఉన్నారు. సుశాంత్ మృతికి.. రియా చక్రవర్తి తో అతడి ప్రేమకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. సుశాంత్ సూసైడ్ కేసులో డ్రగ్స్ కోణం కూడా వెలుగులోకి వచ్చింది. 

ఇదిలా ఉండగా సుశాంత్ జయంతి సందర్భంగా రియా చక్రవర్తి సోషల్ మీడియాలో ఎమోషల్ పోస్ట్ పెట్టింది. సుశాంత్ తో ప్రేమలో ఉన్నప్పుడు అతడితో సరదాగా గడిపిన వీడియోని రియా చక్రవర్తి షేర్ చేసింది. 'మిస్ యూ సోమచ్' అంటూ కామెంట్ పెట్టింది. 

సుశాంత్ మరణించిన సమయంలో అతడి మృతికి కారణం రియానే అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ఆమెని ట్రోల్ చేశారు. నిందించారు. తీవ్రమైన విమర్శలు రియా చక్రవర్తి ఎదుర్కొంది. కానీ ఆ తర్వాత బెయిల్ పై రియా బయటకు వచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 2020 జూన్ 14న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?