షాకింగ్ సర్ ప్రైజ్.. తల్లిదండ్రులైన ప్రియాంక చోప్రా, నిక్ జోనస్.. ఆ విషయం సీక్రెట్ గా..

By team teluguFirst Published Jan 22, 2022, 7:02 AM IST
Highlights

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అభిమానులకు క్రేజీ న్యూస్ చెబుతూ స్వీట్ షాక్ ఇచ్చింది. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు తల్లిదండ్రులయ్యారు.

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అభిమానులకు క్రేజీ న్యూస్ చెబుతూ స్వీట్ షాక్ ఇచ్చింది. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఈ గుడ్ న్యూస్ ని ప్రియాంక చోప్రా, జోనస్ ఇద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సినీ అభిమానులకు, పీసీ ఫ్యాన్స్ కు ఇది ఏమాత్రం ఊహించని సర్ ప్రైజ్. 

కానీ ప్రియాంక చోప్రా ఎప్పుడూ గర్భంతో ఉన్నట్లు ఎటువంటి న్యూస్, ఫోటోలు బయటకు రాలేదు. అలాంటిది ఆమె ఎలా తల్లి ఐంది అనే అనుమానం రావచ్చు. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు సరోగసి విధానం ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. 

'సరోగసి విధానం ద్వారా ఓ బిడ్డని పొందినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఈ ప్రత్యేక సందర్భంలో మాకు ప్రైవసీ కల్పించి మేము ఫ్యామిలీపై ఫోకస్ పెట్టేందుకు సహకరించగలరు.  అందరికి ధన్యవాదాలు' అంటూ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 

ప్రియాంక చోప్రా ఈ స్వీట్ న్యూస్ చెప్పడంతో ఆమె కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పూజా హెగ్డే, హ్యూమా క్యురేషి లాంటి సెలెబ్రిటీలు ప్రియాంక చోప్రాకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అభిమానులంతా సర్ ప్రైజ్ కి గురవుతూనే పీసీని విష్ చేస్తున్నారు. 

బాలీవుడ్ లో తిరుగులేని ఖ్యాతి సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో కూడా గుర్తింపు సొంతం చేసుకుంది. హాలీవుడ్ లో సింగర్ గా రాణిస్తున్న నిక్ జోనస్ పరిచయం కావడంతో అతడి ప్రేమలో పడింది. 2018లో ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులయ్యారు. ప్రియాంక చోప్ర, నిక్ జోనస్ సరోగసి విధానానికి వెళుతున్న న్యూస్ కూడా ఇంతవరకు బయటకు రాలేదు. అంతా సీక్రెట్ గా జరిగింది. వీరు పొందింది మగ బిడ్డా ఆడ బిడ్డా అనేది కూడా ఇప్పటికి సస్పెన్సే. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

click me!