RRR Release: ట్రిపుల్ ఆర్ కు దక్కనున్న అరుదైన గౌరవం... అతి పెద్ద స్క్రీన్ పై జక్కన్న సినిమా

Published : Mar 05, 2022, 07:49 AM IST
RRR Release: ట్రిపుల్ ఆర్ కు దక్కనున్న అరుదైన గౌరవం... అతి పెద్ద స్క్రీన్ పై జక్కన్న సినిమా

సారాంశం

ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ట్రిపుల్ ఆర్ (RRR) సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుంది. వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ట్రిపుల్ ఆర్ సినిమాకు అరుదైన గౌరవం దక్కబోతోంది. 

ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ట్రిపుల్ ఆర్ (RRR) సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుంది. వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ట్రిపుల్ ఆర్ సినిమాకు అరుదైన గౌరవం దక్కబోతోంది. 

దర్శక ధీరుడు.. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి(Rajamouli) డైరెక్షన్ లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), మెగా పవర్స్టార్ రామ్ చరణ్(Ram Charan) ల కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ట్రిపుల్ ఆర్(RRR).  ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులను వెయిటింగ్ లో పెట్టిన ఈసినిమా ఈనెల 25న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే భారీగాప్రమోషన్స్ ను నిర్వహించిన టీమ్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. మరోసారి మూవీ ప్రమోషన్స్ను భారీగానే ప్లాన్ చేశారు. 

అయితే  బ్రిటన్లో దాదాపు  వెయ్యి థియేటర్లలో రిలీజ్ కానున్న ట్రిపుల్ ఆర్ (RRR) కు అరుదైన గౌరవం దక్కబోతున్నట్టు తెలుస్తోంది.లండన్లోని ప్రతిష్టాత్మక ఒడియన్ బీఎఫ్ఐ ఐమ్యాక్స్ లో ట్రిపుల్ ఆర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ థియేటర్ లో రిలీజ్ చేస్తే అంత స్పెషల్ ఏంటీ అంటే.. ఇది బ్రిటన్ లోనే అతి పెద్ద థియేటర్ మాత్రమే కాదు. మరెన్నో విశేషాలు కలిగి ఉన్న ఐమాక్స్ ఇది. 

లండన్లో ఇదే అతిపెద్ద ఐమ్యాక్స్ థియేటర్. లండన్ వాటర్లూలో ఈ ఐమ్యాక్స్ అద్భుతంగా దర్శనం ఇస్తుంది. అంతే కాదు థియేటర్ పరిసరాల్లో నివసించే వ్యక్తులు మాత్రమే ఈ థియేటర్లో సినిమాను చూసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ ఐమాక్స్ లో బ్యాట్ మ్యాన్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాంటి హాలవుడ్ దిగ్గజ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అలాంటి గొప్ప సినిమాలకు సమానంగా ట్రిపుల్ ఆర్ రిలీజ్ కాబోతోంది. 

 అంతే కాదు ఈ గౌరవం దక్కించున్న తొలి ఇండియన్ మూవీగా ట్రిపుల్ ఆర్ (RRR) రికార్డ్ క్రియేట్ చేసింది. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో డివీవీ దానయ్య నిర్మించిన ట్రిపుల్ ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ (Ram Charan), కొమురం భీమ్గా జూనియర్ ఎన్టీఆర్(NTR) నటించారు. ఇక చరణ్ జోడీగా  సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలీవియో నటించారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌