లక్ష్మీస్ ఎన్టీఆర్.. వాలైంటైన్స్ డే స్పెషల్ నోట్

By Prashanth MFirst Published Feb 10, 2019, 1:00 PM IST
Highlights

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు సినిమాకు సంబందించిన పోస్టర్స్ తో కాంట్రవర్సీలను క్రియేట్ చేసిన వర్మ వాలంటైన్స్ డే నాడు సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. 

ఇక సినిమాకు సంబందించిన కొన్ని విషయాలను చెబుతూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తెలుగు ప్ర‌జ‌ల‌కు ఆరాధ్య దైవంగా, తెలుగు ఖ్యాతిని న‌లుదిశ‌లా చేర‌వేసిన ఎన్టీఆర్ లోలోపలి లోని ఒక నిర్వీర్యమైన ప్రేమ‌క‌థ‌ను "ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ "లో ఆవిష్క‌రించ‌బోతున్నాడట. తుది శ్వాస వదిలేవరకు ల‌క్ష్మీ పార్వ‌తి తన గౌర‌వాన్ని కాపాడిన ఎన్టీఆర్ జీవితం పై ఆమె ఎలాంటి ప్ర‌భావం చూపించలేదు..? లక్ష్మీ కోసం తన అన్నీ పణంగా పెట్టి పోరాడిన ఎన్టీఆర్, ల‌క్ష్మీ పార్వ‌తి ల మ‌ద్య అతి రహస్య సంబంధం ఏంటి?  

విడ‌దీయ‌రాని ఆ ఆపవిత్ర బంధం ఎంటి..? ఇలాంటి అంశాలు కొంద‌రికి రుచించ‌క‌పోయినా, అవి తెలుగుప్ర‌జ‌ల‌ గొంతుల్లోకి దిగాల్సిన అవసరముంది కనుకనే 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్'  ఆయన కుటుంబ స‌భ్యుల‌కు, న‌మ్మ‌కంగా లేని అనుచ‌రుల‌కు, వెన్నుపోటుపొడిచిన కుట్ర దారుల‌కు లక్ష్మీస్ ఎన్టీఆర్ ముందుపోటు లా ఉంటుందని పలు అంశాలను వర్మ పేర్కొన్నారు. 

click me!