చంద్రబాబు బయోపిక్.. ఎవరుకొంటారు బాబు?

By Prashanth MFirst Published Feb 10, 2019, 12:03 PM IST
Highlights

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్ ల హావా నడుస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఎలక్షన్స్ దగ్గరపడుతున్న  నేపథ్యంలో  ఎన్టీఆర్...కథానాయకుడు , యాత్ర అంటూ మాజీ సిఎం ల బయోపిక్ లు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఇక ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ ‘చంద్రోదయం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 10న చిత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాత జీవీకే రాజేంద్ర తెలిపారు. 

అయితే రిలీజ్ డేట్ ప్రకటించాక ఈ చిత్రం ట్రేడ్ లోనూ, ఫిల్మ్ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కు అసలు బిజినెస్ అయ్యిందా...ఎవరు కొన్నారు..సొంతగా రిలీజ్ చేస్తున్నారా అంటూ ఆరాలు తీస్తున్నారు. 

ఇక లాస్ట్ ఇయిర్  ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేసారు. అందులో చంద్రబాబు గెట్ అప్ చాలా కామెడీ గా ఉండి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జోకులు కూడా పేలాయి. దాంతో సినిమా కూడా ఆ స్దాయిలోనే ఉండబోతోందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఈ చిత్రం విడుదల అయితే వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ అని కామెంట్స్ చేస్తున్నరు.

దానికి తోడు రిలీడ్ డేట్ గా చెప్పబడ్డ మార్చి 10 ఆదివారం కావడం విశేషం. అది  పరీక్షల సీజన్...ఆ టైమ్ లో  సినిమా విడుదల చెయ్యడమే  పొరపాటు. అటువంటిది ఆదివారం రిలీజ్ ఏమిటో?  ఆ పోస్టర్లు చూసి ఎవరైనా సినిమాకు వస్తారా, సినిమా బాగోపోతే చంద్రబాబుపై సెటైర్స్ వేస్తారు సోషల్ మీడియా జనం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోలేదా నిర్మాత, దర్శకుడు అని డిస్కస్ చేసుకుంటున్నారు.   

మోహన్‌ శ్రీజ సినిమాస్‌ శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజస్‌ పతాకంలో రూపొందిన ఈ చిత్రాన్ని 2016 ఆగస్టులో నారావారిపల్లెలో ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దాదాపు 45రోజుల పాటు నారావారిపల్లెలో షూటింగ్‌ నిర్వహించినట్లు తెలిపారు. కథ, మాటలు, దర్శకత్వం పసుపులేటి వెంకటరమణ వహించినట్లు వివరించారు. 

click me!