నేనెప్పుడూ దేవుడిని తిట్టలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ!

By Prashanth MFirst Published Oct 21, 2018, 6:08 PM IST
Highlights

విలక్షణ దర్శకుడు వివాదాలకు కేంద్ర బిందువుగా పిలవబడే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఎలాంటి హడావుడిలో ఉన్నదో తెలిసిందే. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎప్పుడు పూర్తి చేస్తాడో గాని షూటింగ్ స్టార్ట్ చేయకముందే ప్రమోషన్స్ డోస్ పెంచుతున్నాడు. 

విలక్షణ దర్శకుడు వివాదాలకు కేంద్ర బిందువుగా పిలవబడే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఎలాంటి హడావుడిలో ఉన్నదో తెలిసిందే. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎప్పుడు పూర్తి చేస్తాడో గాని షూటింగ్ స్టార్ట్ చేయకముందే ప్రమోషన్స్ డోస్ పెంచుతున్నాడు. గుళ్ళు గోపురాలు అంటూ కొత్త వర్మను చూపిస్తున్నాడు. ఆ సంగతి అటుంచితే వర్మ ఇప్పుడు ఇస్తున్న ఇంటర్వ్యూలలో చాలా ఆసక్తికరమైన విషయాలను చెబుతున్నాడు. 

పక్కా తాను నాస్తికుడినని చెప్పుకునే వర్మ తిరుపతిలో దర్శనమివ్వడం అందరిని షాక్ కి గురి చేసింది. ఇక రీసెంట్ గా ఆ విషయం గురించి మాట్లాడుతూ.. నేను ఎప్పుడు దేవుడిని తిట్టలేదు. దేవుడిపై భారం వేసే భక్తులను మాత్రమే తిట్టాను. ప్రపంచంక్ మొత్తం నడిపించే దేవుడు లేడని చెప్పేంత మూర్ఖుడినైతే నేను కాదని అన్నాడు.  

అలాగే నేను మాత్రం దేవుడిని నమ్మను అని వర్మ తెలిపాడు. అదే విధంగా తిరుపతికి వేళ్ళడం గురించి చెబుతూ.. ప్లాపులు వస్తున్నందుకు నేను తిరుమలకు వెళ్లలేదు. శివ - రంగీలా వంటి హిట్స్ వచ్చినప్పుడు కూడా నేను ఏ దేవుడిని నమ్మలేదని చెప్పిన వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కోసం మాత్రమే తిరుమలను దర్శించుకొని అక్కడి విశేషాలను తెలుసుకున్నట్లు చెప్పాడు. అదే విధంగా తిరుమల నేపథ్యం సినిమాలో ఉంటుందని తెలియజేశారు.

click me!