మనోజ్ కొత్త జర్నీ.. ప్రపంచమంతా విస్తరింపజేస్తాడట!

Published : Oct 21, 2018, 05:27 PM ISTUpdated : Oct 21, 2018, 05:38 PM IST
మనోజ్ కొత్త జర్నీ.. ప్రపంచమంతా విస్తరింపజేస్తాడట!

సారాంశం

మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా తన ఆలోచనలను వ్యక్తపరుస్తున్న సంగతి తెలిసిందే. సమాజం పట్ల మంచి మాటలను తెలుపుతూ తనదైన శైలిలో కొత్త దారిని వెతుకుతున్నాడు. 

మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా తన ఆలోచనలను వ్యక్తపరుస్తున్న సంగతి తెలిసిందే. సమాజం పట్ల మంచి మాటలను తెలుపుతూ తనదైన శైలిలో కొత్త దారిని వెతుకుతున్నాడు. ఇకపోతే కొద్దిసేపటి క్రితం మనోజ్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసిన ఒక లేఖ వైరల్ గా మారింది. 

ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త దారిలో నడుస్తున్నట్లు మనోజు చెప్పాడు. 'రాయలసీమ వస్తున్నా.. మటన్ పులుసుతో రెడీగా ఉండండి' అంటూ కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నానని అందుకు మీ ఆశీర్వాదం కావాలని మనోజ్ వివరణ ఇచ్చాడు. 

ఇంకా ఏం చెప్పాడంటే.. ప్రతీ మనిషికి మనశ్శాంతే నిజమైన హ్యాపీ. ప్రపంచం మొత్తం తిరిగి అన్ని రంగులు చూశాను. ఎన్నో అంచనాలతో ఇండస్ట్రీలోకి వచ్చాను. నా ఆత్మ సంతృప్తికోసం. నా చుట్టూ ఉన్నవారి ఆనందం కోసం అవన్నీ ఎక్కువగా చేశాను. ఇక ఇప్పుడు నిజమైన మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందా అని వేచి చూడగా అది తిరుపతిలో ఉన్నట్లు తెలిసింది. 

తిరుపతి నుంచి నా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నాను. అది యువతకు ఎంతో సహాయపడుతుంది.రైతుల పిల్లలకు విద్యను అందించడంలో సహాయం చేస్తానని మనోజ్ తెలిపాడు. అదే విధంగా ముందు యువతకు సహాయపడేలా ఏదైనా చేస్తానని చెప్పాడు. తాను చేసే మంచి పనులు ప్రపంచం మొత్తం విస్తరించాలని తెలుగు రాష్ట్రాల్లో వీలైనంత త్వరగా నా సహాయాన్ని విస్తరింప జేస్తానని తెలిపాడు.  

అందుకోసం కొన్ని నెలలపాటు అక్కడే ఉంటా. ఇక నా సినిమా కెరీర్ పోలిటికల్ ఎంట్రీపై ఎలాంటి అనుమానాలు వద్దు. తెరపై ఎప్పటికప్పుడు డిఫరెంట్ రోల్స్ తో కనిపిస్తుంటాను. సినిమా కెరీర్ కు ఎట్టిపరిస్థితుల్లో ఫుల్‌ స్టాప్ పెట్టను అని మనోజ్ లేఖలో తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Peddi Controversy: రామ్ చరణ్ మాటలకు క్రికెటర్ బుమ్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడా? అసలేం జరిగింది?
Bandla Ganesh House: బండ్ల గణేష్‌ కొత్తింటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే.. చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదు