మహేష్ బాబుపై పడ్డ ఆర్జీవీ.. ట్రూలీ సూపర్ స్టార్ అంటూ ఒక రేంజ్ లో!

Siva Kodati |  
Published : May 30, 2019, 06:10 PM IST
మహేష్ బాబుపై పడ్డ ఆర్జీవీ.. ట్రూలీ సూపర్ స్టార్ అంటూ ఒక రేంజ్ లో!

సారాంశం

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ అర్థం కాదు. ఎవరినైనా పొగడడంలోనూ, తిట్టడంలోనూ వర్మ ప్రత్యేక శైలిని అవలంభిస్తారు. రాంగోపాల్ వర్మ నేను వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి హాజరైన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే వర్మ సోషల్ మీడియాలో చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. 

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ అర్థం కాదు. ఎవరినైనా పొగడడంలోనూ, తిట్టడంలోనూ వర్మ ప్రత్యేక శైలిని అవలంభిస్తారు. రాంగోపాల్ వర్మ నేను వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి హాజరైన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే వర్మ సోషల్ మీడియాలో చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. మహేష్ బాబుని ఈ సమయంలో పోవడాలని ఎందుకనిపించిందో కానీ  వీడియో పోస్ట్ చేసి మరీ ప్రశంసలు కురిపించాడు. 

మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు, నదియా నటించిన బజారు రౌడీ చిత్రంలో ఓ సన్నివేశాన్ని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సంగతి తెలిసిందే. నదియా, మహేష్ బాబు కలసి నటించే సన్నివేశం గురించి ఆర్జీవీ ప్రస్తావించాడు. మహేష్ బాబులో క్యూట్ నెస్, యాటిట్యూడ్ చిన్ననాటి నుంచే మొదలయ్యాయి. మహేష్ నిజమైన సూపర్ స్టార్ అని ఆర్జీవీ ప్రశంసించాడు. 

వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాబోతోంది. ఇన్నిరోజులు ఈ చిత్రం కోర్టు సమస్యలతో ఏపీలో విడుదలకు నోచుకోలేదు. 

 

PREV
click me!

Recommended Stories

Maa Vande: మోదీ బయోపిక్‌ `మా వందే` బడ్జెట్‌ తెలిస్తే మతిపోవాల్సిందే.. వామ్మో ఇది హాలీవుడ్‌ రేంజ్‌
Anchor Rashmi: కల్చర్‌ మన బట్టల వద్దే ఆగిపోయింది.. రష్మి గౌతమ్‌ క్రేజీ కౌంటర్‌.. కుక్కల సమస్యపై ఆవేదన